Satyadev: రాజమండ్రిలో ‘జీబ్రా’ టీమ్.. ఆ పని మీదే ఇక్కడికి వచ్చానంటూ హీరో కామెంట్స్

by sudharani |   ( Updated:2024-11-17 14:45:03.0  )
Satyadev: రాజమండ్రిలో ‘జీబ్రా’ టీమ్.. ఆ పని మీదే ఇక్కడికి వచ్చానంటూ హీరో కామెంట్స్
X

దిశ, సినిమా: డిఫరెంట్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ (Satyadev).. ప్రజెంట్ ‘జీబ్రా’ (Zebra) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. యాక్షన్ క్రైమ్ ఎంటర్‌టైనర్ (Action Crime Entertainer)గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఈశ్వర్ కార్తీక్ (Ishwar Karthik) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా.. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా రాజమండ్రి (Rajahmundry)లో సందడి చేశారు చిత్ర బృందం.

ఈ సందర్భంగా సత్యదేవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నార్మల్‌గా చాలా సార్లు రాజమండ్రి వచ్చాను కానీ.. సినిమా పని మీదా ఇదే ఫస్ట్ టైం రాజమండ్రికి రావడం. ఇక్కడకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నవంబర్ 22న నా సినిమా ‘జీబ్రా’ తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది. నిజానికి ఇదే నా మొదటి బిగ్గెస్ట్ మూవీ (Biggest Movie). పెద్ద పెద్ద యాక్టర్లు కూడా ఇందులో యాక్ట్ చెయ్యడం సంతోషంగా ఉంది. నేను కూడా ఇక్కడ గోదావరికి చెందిన వాడినే. నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విషయం ఏంటంటే.. గోదావరి ప్రజలు కథ బాగుంటే సినిమాను బాగా సపోర్ట్ చేస్తారు. బల్ల గుద్ది చెప్తున్న ఈ సినిమా కచ్చితంగా అందరికి నచ్చుతుంది. ఇందులో ఫుల్ కామెడీ ఉంటోంది.. మాస్ ఎంటర్‌టైనర్ ఉంటోంది. నేను మీ అందరికి రిక్వెస్ట్ (request) చేస్తున్న థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి మాకు సపోర్ట్ చేయండి.. నాకు మీరు సపోర్ట్ చేస్తే నా ప్రతి సినిమాకు ఇక్కడకు వచ్చి ప్రమోట్ చేసుకుంటా’ అని నవ్వుకుంటూ చెప్పుకొచ్చారు. కాగా.. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎస్ఎస్ రెడ్డి, బాలసుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ‘పుష్ప’ ఫేమ్ ధనంజయ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.

Read More...

Sundeep Kishan : బర్త్ డేకి తల్లికి కాస్టలీ కార్ గిఫ్ట్ ఇచ్చిన యంగ్ హీరో


Advertisement

Next Story

Most Viewed