గ్రూప్ 3 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

by Naveena |
గ్రూప్ 3 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఆదివారం జిల్లా కేంద్రంలో జరుగుతున్న గ్రూప్-3 పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఉదయం,మధ్యాహ్నం,సాయంత్రం పరిశీలించారు. ఉదయం జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల,ఆల్ మదీనా కాలేజీ,పాలమూరు యూనివర్సిటీ,పాలిటెక్నిక్ కళాశాలలను,మధ్యాహ్నం మౌంట్ బాసిల్ పాఠశాల,సాయంత్రం ఎంవిఎస్ డిగ్రీ కళాశాలలో పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలిస్తూ,అధికారులను తగు సూచనలు చేశారు. పరీక్షల సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా,ప్రశాంతంగా జరిగేటట్లు చూడాలని,పరీక్షా హాల్ లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించకూడదని,అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరమే లోపలికి అనుమతించాలని ఆమె ఆదేశించారు. మొదటిరోజు 52 కేంద్రంల్లో 19465 మంది అభ్యర్థులు ఉండగా..10646 మంది హాజరయ్యారని ఆమె తెలిపారు.

పరీక్ష కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ జానకి....

మహబూబ్ నగర్ జిల్లాలో ఆదివారం మొదలైన గ్రూప్-3 పరీక్షల కేంద్రాల వద్ద బందోబస్తును జిల్లా ఎస్పీ జానకి పర్యవేక్షించారు. ఈ సంధర్భంగా ఆమె ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్ద ఉన్న పోలీస్ అధికారులకు పలు భద్రతపరమైన సూచనలు చేశారు. పరిసరాలలోని జీరాక్సు,ఇంటర్ నెట్ సెంటర్లు తెరిచి ఉన్నాయా అని,ఎక్కడైనా లౌడ్ స్పీకర్స్ మోతలు ఉన్నాయా అని వాకబు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా పరీక్షల నిర్వహణ జరగాలని ఆమె ఆదేశించారు. ఆమెతో పాటు అదనపు ఎస్పీ రాములు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed