Hyderabad : 1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

by M.Rajitha |
Hyderabad : 1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న కంపెనీపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లిలో గల "సోనీ అల్లం వెల్లుల్లి పేస్ట్" పేరుతో భారీ స్థాయిలో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్, బోయినపల్లి పోలీసులు దాడులు నిర్వహించారు. ఏకంగా 1500 కేజీల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ని సీజ్ చేశారు. మరో 4లక్షల 50 వేలు విలువ చేసే మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. పేస్ట్ తయారీలో కెమికల్స్, కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లి వాడుతున్నట్లు గుర్తించారు. కాగా కల్తీ అల్లం వెల్లుల్ల తయారు చేస్తున్న 8మందిని పోలీసులు అరెస్ట్ చేయగా.. కంపెనీ యజమాని మహ్మద్ షకీల్ అహ్మద్ పరారయ్యాడు. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను సిటీలోని చాలా రెస్టారెంట్ల, హోటల్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లకు పంపిణీ చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

Advertisement

Next Story

Most Viewed