Rohith Sharma : రోహిత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఆసీస్ తో తొలి టెస్టుకు దూరం

by M.Rajitha |
Rohith Sharma : రోహిత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఆసీస్ తో తొలి టెస్టుకు దూరం
X

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohith Sharma) అభిమానులకు బ్యాడ్ న్యూస్. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా, భారత్ (AUS vs IND) మధ్య జరగనున్న తొలి టెస్టుకు రోహిత్ దూరం అయ్యాడు. రోహిత్ భార్య రెండో కాన్పు కోసం భారత్ లోనే ఉండిపోగా.. మిగతా టీం అంతా ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకుంది. కాగా ఫాదర్ హుడ్ ను ఆస్వాదించడానికి పెర్త్(Perth) వేదికగా జరగనున్న తొలి టెస్టుకు తాను అందుబాటులో ఉండటం లేదని ఇప్పటికే రోహిత్ బీసీసీఐ(BCCI)కి తెలియ జేసినట్లు సమాచారం. అయితే దీనిపై బీసీసీఐ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇక రోహిత్ కు బదులు బుమ్రా(Bumra) కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించనున్నట్టు సమాచారం.

Advertisement

Next Story