- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG: విజయవంతంగా కొనసాగుతున్న ఇంటింటి సర్వే.. ఇప్పటివరకు ఎంతశాతం అయిందంటే?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే 2024) విజయవంతంగా కొనసాగుతోంది. అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. నవంబర్ 6న ప్రారంభమైన ఈ సర్వే.. 12 రోజుల్లోనే సగానికిపైగా పూర్తయింది. ఆదివారం (నవంబర్ 17) నాటికి 58.3% సర్వే పూర్తయినట్టు అధికారలు తెలిపారు. సర్వేలో ముందుగా నవంబర్, 6 నుంచి 8 వరకు రాష్ట్రంలో ఇళ్ల గణనను ప్రభుత్వం చేపట్టిన విషయం తెల్సిందే. సర్వేలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 ఇళ్లను గుర్తించారు. నవంబర్, 9 నుంచి ఇంటింటి వివరాలను సేకరించడం ప్రారంభమైంది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 67,72,246 గృహాల సర్వే పూర్తయినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ సర్వే కోసం రాష్ట్ర వ్యాప్తంగా87,807 మంది ఎన్యూమరేటర్లను ప్రభుత్వం నియమించింది. గ్రామీణ ప్రాంతాల్లో 47,561, పట్టణ ప్రాంతాల్లో 40,246 మంది ఎన్యూమరేటర్లు సర్వేలో పాల్గొంటున్నారు. మొత్తం పర్యవేక్షకులు8,788 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 4,947, పట్టణ ప్రాంతాల్లో 3,841 మందిని సర్వే పరిశీలన కోసం నియమించింది. జిల్లాల వారీగా సర్వే పురోగతిలో ములుగు 87.1%, నల్గొండ 81.4% జిల్లాలు ముందంజలో ఉన్నాయి. జనగాం 77.6%, మంచిర్యాల 74.8%, పెద్దపల్లి 74.3% తర్వాత వరుసలో ఉన్నాయి. జన సాంద్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ సిటీలో 38.3% సర్వే పూర్తయినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పూర్తి చేసిన సర్వేను ఈ నెల 20 నుంచి డేటా ఎంట్రి చేయడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వివరాల ద్వారా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఎంత వరకు కల్పించవచ్చు అనేది నిర్ణయించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు.
నవంబర్ 17 నాటికి సర్వే పూర్తయిన ఇండ్ల సంఖ్య:
= గ్రామీణం: 64,41,183
= పట్టణం: 51,73,166
మొత్తం: 1,16,14,349
బ్లాకులు:
= గ్రామీణం: 52,493
= పట్టణం: 40,408
మొత్తం: 92,901