Delhi Pollution : ఢిల్లీలో అన్ని స్కూల్స్ మూసివేత

by M.Rajitha |
Delhi Pollution : ఢిల్లీలో అన్ని స్కూల్స్ మూసివేత
X

దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) డేంజర్ బెల్స్ దాటిపోయింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేడేడ్ రెస్పాన్స్ యాక్షన్స్ ప్లాన్ -4 (GRAP-4) కింద ప్రభుత్వం మరిన్ని నిబంధనలు విధించింది. ఇవన్నీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి అమలులోకి రానున్నాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్ని పాఠశాలలను మూసీ వేసింది. అన్ని తరగతులకు కేవలం ఆన్లైన్ తరగతులే నిర్వహించాలని ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ కళాశాలలకు సియత్తం ఇదే నిబంధన వర్తించనుంది. నిత్యావసర వస్తువులు మినహా అన్నిరకాల ట్రక్కులను ఢిల్లీలోకి నిలిపి వేయనున్నారు. అన్ని నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఎన్సీఆర్ పరిధిలోని అన్ని కార్యాలయాలు కేవలం 50 శాతం మందితో నిర్వహించేలా చూడాలని అన్ని కంపెనీలకు ఆదేశాలు జారీ చేశారు. కాగా ఆదివారం సాయంత్రం ఢిల్లీలో వాయు నాణ్యతా సూచీ 457కి పెరగడంపై ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్(CAQM) ఆందోళన వ్యక్తం చేసింది.

Advertisement

Next Story

Most Viewed