Karti Chidambaram: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీలు ఫైర్

by Shamantha N |
Karti Chidambaram: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీలు ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: పనివారాలపై ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి(Infosys Narayana Murthy) వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం(Karti Chidambaram) స్పందించారు. సుదీర్ఘంగా పని చేయాలని చెప్పడం అర్థరహితమన్నారు. ఇక, నారాయణమూర్తి పని రోజుల కంటే సమర్థతపై దృష్టి పెట్టాలని కార్తీ చిదంబరం తెలిపారు. మన రోజువారీ జీవితం ఒక పోరాటంలా కొనసాగుతుందన్నారు. అసమర్థమైన, నాసిరకం మౌలిక సదుపాయాలు, సౌకర్యాలతో పోరాడుతుంటామన్నారు. మంచి సామాజిక, సామరస్య పరిస్థితుల కోసం వర్క్‌లైఫ్‌ బ్యాలెన్స్‌ అనేది చాలా ముఖ్యం అని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి మనం వారానికి 4 రోజుల పని దినాలకు మారిపోవాలని డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు వర్క్ ముగించాలని కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం తెలిపారు.

నారాయణమూర్తి ఏమన్నారంటే?

కార్తీ చిదంబరం చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్(Gaurav Gogoi) కూడా మద్తతు తెలిపారు. నారాయణమూర్తి ప్రకటనతో విభేదించారు. “వర్క్- లైఫ్ బ్యాలెన్స్ పై నారాయణమూర్తి అభిప్రాయంతో నేను కూడా విభేదిస్తున్నా. జీవితంలో అన్నింటికంటే ముఖ్యం మీ పిల్లలను చూసుకోవడం, వారికి అన్నీ నేర్పించడం, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడం, మీ స్నేహితులకు అవసరమైన సమయాల్లో అక్కడ ఉండటమే" అని చెప్పుకొచ్చారు. ఇకపోతే, అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటలు( 70 Hour Workweek) పని చేయాలని నారాయణమూర్తి అన్నారు. అలాగే, భారత్‌ వారానికి ఐదు రోజుల పని దినాలు ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌పై నాకు నమ్మకం లేదని ఆయన వెల్లడించారు. దీనిపై కాంగ్రెస్‌ ఎంపీలు స్పందించారు.

Advertisement

Next Story

Most Viewed