- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాచకొండ కమిషనరేట్ లో పెరిగిన క్రైం రేట్.. సీపీ సుధీర్ బాబు
by Sumithra |
X
దిశ, సిటీ క్రైమ్ : విజుబుల్ పోలీసింగ్, క్విక్ రెస్పాన్స్, టెక్నాలజీతో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలను పటిష్టంగా నిర్వహిస్తున్నామని పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. సోమవారం వార్షిక నివేదిక విడుదల సందర్భంగా సీపీ మాట్లాడారు. ఈ ఏడాదిలో మొత్తం 33,084 ఎఫ్ఐఆర్ లు నమోదు కాగా 25,143 కేసులను ఒక కొలిక్కి తీసుకు వచ్చారన్నారు.
డయల్ 100 కు 2.41 లక్షల ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. వీటికి 8.37 నిమిషాల్లోనే కాల్ చేసిన వారికి పోలీసు సేవలను అందించామని చెప్పారు. ఈ సంవత్సరంలో 4 శాతం నేరాలు పెరిగాయని, మహిళల పట్ల జరిగే నేరాలు తగ్గాయని సీపీ వివరించారు. నేరాలు చేసిన 160 మందికి జైలు శిక్షలు పడ్డాయని అందులో 30 మందికి జీవిత ఖైదు శిక్షలు పడ్డాయన్నారు. సైబర్ క్రైం నేరాలు 42.5% పెరిగాయని సీపీ తెలిపారు.
Advertisement
Next Story