- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pm Modi: ఏపీకి ప్రధాని మోడీ.. పర్యటన తేదీ ఫిక్స్
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ(Prime Minister Modi) ఏపీ(Ap) పర్యటన ఖరారు అయింది. జనవరి 8న ఆయన రాష్ట్రానికి రానున్నారు. ఈ మేరకు ఎంపీ సీఎం రమేశ్(MP CM Ramesh) అధికారికంగా తెలిపారు. అనకాపల్లి జిల్లా పుడిమడకలో ఎన్టీపీసీ, ఏపీ జెన్ కో జాయింట్‌గా నెలకొల్పనున్న గ్రీన్ హైడ్రోజన్ హబ్(Green Hydrogen Hub)కు జనవరి 8న శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్(Mittal Steel Plant) నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు.
కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఎన్నికలకు ముందు టీడీపీ(Tdp), బీజేపీ (Bjp), జనసేన(Janasena) కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నాయకులు ఘన విజయం సాధించారు. దీంతో రాష్ట్రంలో వైసీపీ(Ycp) పాలన పోయి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. అప్పటి నుంచి కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో పీఎమ్ మోడీ సహకారం అందిస్తున్నారు. ఏపీ రాజధానికి కావాల్సిన నిధులను అందిస్తున్నారు. దీంతో జనవరి నెలలో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రధాని మోడీ రానున్నారు. మరి ఏ మేరకు ఆయనకు కూటమి నాయకులు ఎంత గ్రాండ్‌గా స్వాగతం పలుకుతారో చూడాలి.