Christmas: క్రిస్మస్‌కు ఇంటికెళ్లని వారు పండుగను ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోండి..!

by Anjali |   ( Updated:2024-12-23 15:56:01.0  )
Christmas: క్రిస్మస్‌కు ఇంటికెళ్లని వారు పండుగను ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోండి..!
X

దిశ, వెబ్‌డెస్క్: క్రైస్తవులంతా ప్రతి ఏటా డిసెంబరు 25 వ తేదీన ఎంతో ఘనంగా జరుపుకునే వేడుక క్రిస్మస్(Christmas). ఇందుకోసం క్రిస్ట్రియన్స్ అంతా ఎంతగానో ఎదురుచూస్తారు. వీరికి ఇదే పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. ఈ పండుగను ఆత్మీయులంతా ఒకే చోట చేరి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఉద్యోగం చేసేవారు, చదుకునేవారు సెలవులు దొరకక కొన్నిసార్లు రాలేని పరిస్థితులు నెలకొంటాయి. కాగా అలాంటి సందర్భాల్లో క్రిస్మస్ ఫేస్టివల్‌ను సింగిల్ గా జరుపుకోవడం కాస్త కష్టంగా, బాధగా అనిపిస్తుంది. అయితే ఇంట్లోని కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నా.. క్రిస్మస్‌ను హ్యాపీగా జరుపుకోవాలంటే మీరు ఇలా చేయండి. ఫ్యామిలీని మిస్ అయిన భావన మీలో కలగొద్దంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

ఆన్‌లైన్‌ కనెక్టివిటీ

కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉండే వారికి ఒకప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు. కాగా ఇంటి సభ్యులకు వీడియో కాల్(video call) చేసి మాట్లాడండి. వారు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కూడా వీడయో కాల్‌లోనే ఉండండి. వారిలో పాటుగా హ్యాపీగా సాంగ్స్ పాడండి. ఫ్యామిలీతో కలిసి భోజనం కూడా ఒకేసారి చేయండి.

అనాథలకు సహాయం చేయండి

క్రిస్మస్ పండుగ రోజు అనాథలకు హెల్ప్(Help for orphans) చేయండి. దయ, ప్రేమ, మానవత్వం వ్యక్తపరిచేందుకు ఇదే మంచి టైమ్. కాగా డిసెంబరు 25 వ తేదీన అనాథ ఆశ్రయాలకు వెళ్లి మీ చేతుల మీదుగా వారికి ఏదైనా సహాయం చేయండి. లేదా పేదవారికి సాయం చేయండి. అలాగే కొత్త క్రిస్మస్ సంప్రదాయాలను సృష్టించండి.

గిఫ్ట్‌లు- క్రిస్మస్ కార్డులు పంపండి

మీ కుటుంబ సభ్యులకు వారికి ఇష్టమైన బహుమతులు ఇంటికి పంపించండి. లేదా మీరే వ్యక్తిగతంగా తయారు చేసినా క్రిస్మస్ కార్డుల(Christmas cards)ను కూడా పంపితే మీ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. క్రిస్మస్ కార్డు ద్వారా వారిపైనున్న మీ ప్రేమను పంచడానికి ఒక అద్భుతమైన మార్గమని చెప్పుకోవచ్చు.

మీ ఇంటిని అలంకరించండి

మీరు క్రిస్మస్‌కు ఇంటికి వెళ్లని పరిస్థితులు ఉంటే.. మీరు ఉన్న ఇంటినే చక్కగా అలంకరించండి. దీంతో అక్కడ పండగ వాతావరణం ఏర్పడుతుంది. అలాగే మీరున్న దగ్గరే క్రిస్మస్ ట్రీ (Christmas tree)పెట్టండి. లైట్లు(lights), ఫ్లవర్స్‌‌(Flowers)తో ట్రీని అలంకరించండి.


Read More..

Trending : క్రిస్మస్ స్ట్రెస్‌ఫుల్‌ సీజన్‌గా మారకూడదంటే.. మీరు చేయాల్సింది ఇదే..

Advertisement

Next Story