ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగవంతం చేయాలి : కామారెడ్డి కలెక్టర్

by Aamani |
ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగవంతం చేయాలి : కామారెడ్డి కలెక్టర్
X

దిశ, కామారెడ్డి : ఇందిరమ్మ ఇండ్ల సర్వే పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. కలెక్టరేట్ లో అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సర్వేను ఎంపీడీఓలు సూపర్ చెక్ చేయాలని తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ ప్రాంతంలో సర్వే పనులు మందకొడిగా సాగుతున్నాయని, సర్వే ను వేగవంతం చేయాలని ఆదేశించారు. దోమకొండ మండలంలో కూడా సర్వే వేగంగా నిర్వహించాలని అన్నారు . క్షేత్ర స్థాయిలో సర్వేయర్స్ విధులు నిర్వహించాలని అన్నారు.

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి...

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు తదితర సమస్యలపై జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజావాణి లో వచ్చిన అర్జీలను ఆయా శాఖాధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ రోజు (84) అర్జీలు ప్రజావాణిలో రావడం జరిగాయని తెలిపారు. అర్జీ దారు దరఖాస్తు పై తీసుకున్న చర్యల గురించి దరఖాస్తు దారునికి తెలియపరచాలని సూచించారు.

పెట్టుబడి రాయితీ మంజూరుకు ఆమోదం...

జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా జిల్లా ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ లో కలెక్టర్ టీ ప్రైడ్ క్రింద షెడ్యూల్ కులాల నలుగురికీ రూ.11,99,333/- లు, ఏడుగురు షెడ్యూల్ తెగల వారికి రూ.21,58,351/- లు, ఒక ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ నకు రు.3,31,211/- లు పెట్టుబడి రాయితీ మంజూరుకు ఆమోదించనైనదని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రజావాణిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో రంగనాథ్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story