CM Revanth: కన్యాకుమారిలో సీఎం రేవంత్ క్రిస్మస్ సెలబ్రేషన్స్

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-23 12:05:44.0  )
CM Revanth: కన్యాకుమారిలో సీఎం రేవంత్ క్రిస్మస్ సెలబ్రేషన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇవాళ తమిళనాడులోని కన్యాకుమారి(Kanyakumari) పర్యటనకు వెళ్లనున్నారు. సోమవారం అక్కడ జరిగే క్రిస్‌మస్ వేడుక(Christmas Celebrations)ల్లో పాల్గొననున్నట్లు సమాచారం. కన్యకుమారి ఎంపీ విజయ్ వసంత్ ఆహ్వానం మేరకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన తిరువనంతపురం చేరుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్‌మస్ వేడుకలు నిర్వహించారు.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం సీఎం రేవంత్ కేక్‌ కట్ చేసి, అందరికీ క్రిస్‌మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని మతాలకు సమాన రక్షణ కల్పించాలన్నదే ప్రజా ప్రభుత్వ విధానమన్నారు. సర్వమత సమానత్వం విషయంలో ఇతర మతాలను కించపరిచే చర్యలను ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు.

Advertisement

Next Story