కాలువ చివరి ఆయకట్టు వరకు నీరందిస్తాం : మక్తల్ ఎమ్మెల్యే

by Aamani |
కాలువ చివరి ఆయకట్టు వరకు నీరందిస్తాం  : మక్తల్ ఎమ్మెల్యే
X

దిశ, మక్తల్: మక్తల్ నియోజకవర్గంలోని, అమరచింత మండలంలో సోమవారం సాయంత్రం ప్రియదర్శిని జుర్యాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాలువ గేట్లను తెరిచి కాల్వలకు మక్తల్ ఎమ్మెల్యే డా. వాకిటి శ్రీహరి విడుదల చేశారు. ప్రపంచ వ్యవసాయ దినోత్సవం సందర్భంగా కాలువకు నీళ్లు విడుదల చేయడం శుభ పరిణామం అని, కాలువ చివరి ఆయకట్టులో సాగు చేసుకున్న రైతుల పొలాలకు నీళ్లు అందించేలా తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. వచ్చే వేసకాలంలో కాల్వ లన్నింటికి లైనింగ్ పూర్తి చేస్తామన్నారు. వ్యవసాయానికి ఇక ప్రాధాన్యత తమ ప్రభుత్వం వ్యవసాయానికి ఇక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి రైతు జీవితం కుటుంబం ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ పాస్ పుస్తకం చుట్టూ తిరుగుతున్నదని, అందుకే రైతుకు బ్యాంకులో రుణాలు ఉండరాదన్న ఉద్దేశం తో నాటి వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేశాడన్నారు. భూములను సాగు చేసుకున్న రైతులకు సహాయం అందాలన్న ఉద్దేశంతో రైతుల వివరాలను వెరిఫికేషన్ చేసి సంక్రాంతి పండుగ కానుకగా రైతు భరోసా అందిస్తామని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో కల్లు గీత సంఘం చైర్మన్ నాగరాజు గౌడ్, సంబంధిత అధికారులు మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story