Brain Cancer: మొబైల్ ఫోన్లకు, బ్రెయిన్ క్యాన్సర్‌కు ఎలాంటి సంబంధం లేదు.. WHO అధ్యయనంలో వెల్లడి

by Maddikunta Saikiran |
Brain Cancer: మొబైల్ ఫోన్లకు, బ్రెయిన్ క్యాన్సర్‌కు ఎలాంటి సంబంధం లేదు.. WHO అధ్యయనంలో వెల్లడి
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్(Smart Phone) వినియోగం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా యువత జీవితంలో స్మార్ట్ ఫోన్ ఓ భాగంగా మారింది. ప్రతి చిన్న అవసరానికి మొబైల్ వాడటం కామన్ అయిపోయింది. కాగా స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడితే బ్రెయిన్ క్యాన్సర్(Brain Cancer) వచ్చే అవకాశం ఉందని చాలామంది హెచ్చరిస్తూ ఉంటారు. అయితే బ్రెయిన్ క్యాన్సర్‌కు మొబైల్ వినియోగంతో సంబంధం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆస్ట్రేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్ అండ్ న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో ఫోన్‌కు, మెదడు క్యాన్సర్‌తో సంబంధం లేదని తెలిసింది. 1994 నుంచి 2022 మధ్యకాలంలో 5వేల మందిపై స్టడీ చేసిన తర్వాత ఈ విషయం కనుగొన్నారు. కాగా రేడియో ఫ్రీక్వెన్సీ విద్యుదయస్కాంత క్షేత్రాలను క్యాన్సర్ కారకాలుగా గతంలో ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్(IARC) పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed