- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Media Outlets: టెక్ కంపెనీలతో మీడియాకు నాలుగు సవాళ్లు: కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్
దిశ, నేషనల్ బ్యూరో: టెక్ దిగ్గజ కంపెనీల(Big Tech Companies)తో న్యూస్ మీడియా రంగం(Media Outlets) నాలుగు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటున్నదని, ఆ కంపెనీలు పారదర్శకంగా, గొప్ప బాధ్యతతో వ్యవహరించాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Union Minister Ashwini Vaishnaw) అన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టెక్ కంపెనీలు, ఆ కంపెనీల సాంకేతికతతో సాంప్రదాయ మీడియా రంగం కొన్ని కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నదని వివరించారు. ఆ కంపెనీల మాధ్యమాల్లో సమాచారం పోస్టవుతుందని, కానీ, అది సత్యమా? అసత్యమా? అని పరీక్షించే ప్రక్రియ ఉండదని తెలిపారు. కుప్పలుగా వచ్చే సమాచారం కొన్నిసార్లు తప్పుదోవపట్టించేదిగా ఉంటున్నదని పేర్కొన్నారు. కాబట్టి, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ తప్పకుండా అసత్య సమాచారాన్ని నిలువరించాలని సూచించారు. ఇలాంటి ఫేక్ న్యూస్‌లు మీడియాపై విశ్వాసాన్ని కొల్లగొడుతుందని, అది అంతిమంగా ప్రజాస్వామ్యానికే ముప్పుగా పరిణమించవచ్చునని వివరించారు.
ఈ విషయంలో దిగ్గజ టెక్ కంపెనీలు బాధ్యత వ్యవహరించకపోతే ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 79 కింద కల్పించిన రక్షణను తొలగిస్తామని కేంద్ర మంత్రి హెచ్చరంచారు. యూజర్లు ఆ కంపెనీల సైట్‌లలో చట్టవ్యతిరేక పోస్టులు పెడితే అధికారులు ఆ కంపెనీపై కాకుండా యూజర్‌పై యాక్షన్ తీసుకుంటారు. అలాంటి పోస్టుల నుంచి ఆ టెక్ కంపెనీలకు ముఖ్యంగా సోషల్ మీడియా కంపెనీలకు ఈ సెక్షన్ రక్షణ కల్పిస్తున్నది. ఈ కంపెనీలు పుట్టిన దేశాల్లో కంటే భారత్‌లో చాలా విషయాలు భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయని, కాబట్టి, సెన్సిటివిటీ కోసం ఇక్కడ భిన్నమైన నియంత్రణలు అమలు చేయడంలో తప్పేమీ లేదని పేర్కొన్నారు.
అల్గారిథమ్ బయాస్:
సాధారణంగా యూజర్లు ఎంగేజ్ అయ్యే కంటెంట్‌కు ప్రయారిటీ ఇచ్చి వాటిని మరింత వైరల్ చేసేలా అల్గారిథమ్ పని చేస్తుంది. విభజన లేదా సంచలన కథనాలు, సమాచారమే ఎక్కువగా ఈ కోవలో ఎక్కువగా యూజర్లకు రీచ్ కావొచ్చు. ఫలితంగా ఇది సమాజంలోని సంతులనాన్ని దెబ్బతీయొచ్చని కేంద్రమంత్రి హెచ్చరించారు. అలాగే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పునూ ఆయన ప్రస్తావించారు. ఏఐ మోడల్స్ వాటికి అందించిన విస్తృత డేటాసెట్స్ ట్రైనింగ్ వల్ల సృజనాత్మక కంటెంట్‌ను కూడా క్రియేట్ చేయగలుగుతుందని వివరించారు. అలాంటప్పుడు ఆ డేటాకు పని చేసిన నిజమైన క్రియేటర్ల హక్కులు, వారి గుర్తింపు పరిస్థితేమిటీ? వారి కృషికి గుర్తింపు లభిస్తుందా? ఇది కేవలం ఆర్థిక సమస్యే కాదు, నైతిక సమస్య కూడా అని కేంద్రమంత్రి వివరించారు.
న్యాయం దక్కాల్సిందే
మీడియా రంగం కృషితో సమాచారం వార్తల రూపం దాల్చితే.. అవి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఆధారంగా యూజర్లకు ఎక్కువగా చేరవవుతాయి. సాంప్రదాయ మీడియా ఆర్థిక ఆంక్షలతో వీటికి పోటీపడి యూజర్ల చెంతకు ఆ వార్తలను తీసుకెళ్లలేకపోవచ్చునని, ఈ విషయంలోనూ న్యాయంగా మీడియాకు దక్కాల్సిన గుర్తింపు, ఆర్థిక వాటానూ చర్చించాలని కేంద్రమంత్రి వైష్ణవ్ వివరించారు. కంటెంట్ క్రియేట్ చేయడానికి మీడియా కృషిని గుర్తించి వాటికి దక్కాల్సిన వాటాను పరిహారంగా టెక్ కంపెనీలు అందించడమే న్యాయమని చెప్పారు.