అల్లు అర్జున్‌కు షాక్.. పోలీసుల సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-12-22 17:12:05.0  )
అల్లు అర్జున్‌కు షాక్.. పోలీసుల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అల్లు అర్జున్ ప్రీమియర్ షో చూసేందుకు రావద్దని, ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని, సంధ్య థియేటర్ యాజమన్యానికి చిక్కపడల్లి పోలీస్ స్టేషన్ ఏసీపీ, సీఐ తెలిపారని, అయినా థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇంటిగ్రేటెట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆడిటోరియమ్ హైదరాబాద్ కమిషనరేట్‌లో వార్షిక సమావేశం ఆదివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీవీ ఆనంద్ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలిపారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన వీడియో విలేకరులకు చూపించారు. అల్లు అర్జున్ దగ్గరకి ఏసీపీ వెళ్ళారు అనే అంశం వీడియోలో లేదని విలేకరులు అడిగిన ప్రశ్నలకు చిక్కడపల్లి ఏసీపీ, సీఐలతో సమాదానం చెప్పించారు.

తొక్కిసలాట ఘటన జరిగిందని, ఓ తల్లి కొడుకు అపస్మాకర స్థితిలోకి వెళ్ళారని, చెబుదామని అల్లు అర్జున్ దగ్గరకి వెళ్ళే ప్రయత్నిస్తే అతని మేనేజర్ కలవనివ్వలేదని ఏసీపీ ఎల్. రమేష్ కుమార్ తెలిపారు. 15 నిమిషాల తర్వాత అల్లు అర్జున్ దగ్గరకు వెళ్ళి చెబితే సినిమా చూసే వెళతానని వారించారని ఆయన తెలిపారు. ఈలోపు తొక్కిసలాట వల్ల రేవతి అనే మహిళ మరణిచిందని డాక్టర్లు చెప్పడంతో అల్లు అర్జున్‌ను బలవంతంగా థియేటర్ నుండి బయటకు పంపినట్లు తెలిపారు. వెళ్ళే సమయంలో కూడా రోడ్డు మీద కారు సన్ రూఫ్ నుండి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్ళారని ఏసీపీ ఎల్. రమేష్ కుమార్ తెలిపారు.

కంట తడిపెట్టిన చిక్కడపల్లి సీఐ రాజు నాయక్

ప్రీమియర్ షో చూసేందుకు హీరో అల్లు అర్జున్ వస్తున్నారని థియేటర్ యాజమాన్యం బందోబస్తు అనుమతి కోరుతూ లేఖ రాశారని , బందోబస్తు ఇవ్వలేమని చెప్పామని, అనుమతి కోరిన లేఖపై రాసి పంపినట్లు చిక్కడపల్లి సీఐ రాజు నాయక్ తెలిపారు. 15 రోజులు మానసికంగా కృంగి పోయానని తెలిపారు. రేవతి ప్రాణాలు తన చేతులలోనే పోయాయని , పోలీసులు సీపీఆర్ చేసినా బతకలేదని, ఆమె కుమారుడు శ్రీతే‌ను మాత్రం కొంత మేర కాపాడగలిగామని కన్నీటిపర్యాంతం అవుతూ తెలిపారు. తాను కూడా తొక్కిసలాటలో గాయలు పాలు అవడమో, మృతి చెందడమో జరిగేదని తోపులాట ఆ విధంగా జరిగిందని తెలిపారు. అల్లు అర్జున్ వచ్చిన సమయంలో బౌన్సర్లు వ్యవహరించిన తీరు వల్లే ఇదంతా జరిగిందన్నారు.

బౌన్సర్‌లు ఓవర్ చేస్తే ఏజన్సీలపై, వీఐపీ. వీవీఐపీలపై చర్యలు

సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కు సంబంధించిన బౌన్సర్లు అతి చేశారని తమ దృష్టికి వచ్చిందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. పోలీసులును కూడా తోసేశారని వీడియోల్లో క్లియర్‌గా ఉన్నాయని అన్నారు. ఇప్పటి నుండి బౌన్సర్స్ అతి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. బౌన్సర్‌లు ఓవర్ చేస్తే వారి పెట్టుకున్న ఏజెన్సీలపై, వీఐపీ. వీవీఐపీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఫోన్ ట్యాంపింగ్ సంబంధించి అన్ని రకాల చర్యలు చేపట్టామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. కేసు పురోగతిలో ఉందన్నారు. మాజీ ఎస్‌ఐబీ చీఫ్ డీజీ అధికారి ప్రభాకర్ రావును అమెరికా నుంచి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇండియన్ కాన్సులేట్ అధికారులు ఆమెరికా కాన్సులెేట్ అధికారులతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపామని , సంఘ విద్రోహ కదలికపై నిఘా పెంచామని తెలిపారు. హైదారబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఎవరూ ట్రాఫిక్ జాంలో ఇబ్బందులు పడకుండా త్వరలో డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తానమన్నారు. 2024 సంవత్సర కాలంలో ప్రశాంతంగా విధులు నిర్వహించామని అన్నారు. శ్రీరామనవమి మొదలుకుని గణేష్ శోభయాత్ర, మిలాద్, దసరా ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించామన్నారు. ఈ సంవత్సరంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ జరిగిందని, అవి కూడా ప్రశాంతంగా జరిగాయన్నారు. సౌండ్ పొల్యూషన్‌పై కఠినంగా వ్యవహరించామని ఆ విషయంలో ప్రజల హర్షించారని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

విధుల్లోకి 39 మంది ట్రాన్స్‌జెండర్లు

సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకాలతో ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించే ప్రక్రియ పూర్తి చేసినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వారికి ఫిట్‌నెస్, ఇతర పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలు కూడా అందజేయడం జరిగిందన్నారు. ట్రాఫిక్ నియంత్రణపై 39 మందికి 15 రోజుల పాటు శిక్షణ కల్పించామని, విధుల్లోకి తీసుకొనున్నామని తెలిపారు. ట్రాన్స్ ‌జెండర్లు గౌరవప్రదంగా జీవనం సాగించేలా విధి నిర్వహణలో పాల్గొని మిగతా ట్రాన్స్‌జెడర్లకు స్పూర్తిగా నిలవాలని సీవీ ఆనంద్ పిలుపు నిచ్చారు.

Advertisement

Next Story