- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana DGP : ఏసీపి విష్ణుమూర్తిపై క్రమశిక్షణ చర్యలకు డీజీపీ ఆదేశం
దిశ, వెబ్ డెస్క్ : ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా మీడియా సమావేశం నిర్వహించిన ఏసీపీ విష్ణుమూర్తీ(ACP Vishnumurty)పై చర్యలు తీసుకోవాలని డీజీపీ(DGP) ఆదేశించారు. కాగా ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీస్ కమీషనరెట్ సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఏసీపీ విష్ణుమూర్తి విధుల్లో లేడని.. అక్రమాలకు పాల్పడటం వలన గత అక్టోబర్లో సస్పెండ్ కు గురయ్యడాని తెలిపారు. ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విష్ణుమూర్తి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించిన విషయం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)కి పంపుతున్నామన్నారు. దీనిపై డీజీపీ కార్యాలయం విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించిన వారిపై అవసరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే అల్లు అర్జున్(Allu Arjun) శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్ పై సస్పెండ్ కాబడిన ఏసీపీ విష్ణుమూర్తి మీడియా సమావేశం నిర్వహించి.. పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దృష్టికి వెళ్ళి.. తొక్కిసలాట ఘటనతో సంబంధం లేని పోలీసులు జోక్యం చేసుకోకుండా చూడాలని ఉన్నతాధికారులకు సూచించారు. దీంతో విష్ణుమూర్తీపై క్రమశిక్షణ చర్యలకు దిగినట్టు తెలుస్తోంది.