Big Alert: ట్యాక్స్ పేయర్స్ కు బిగ్ అలర్ట్.. ఐటీఆర్‌లో ఆ వివరాలను వెల్లడించకుంటే రూ. 10 లక్షల జరిమానా..!

by Maddikunta Saikiran |
Big Alert: ట్యాక్స్ పేయర్స్ కు బిగ్ అలర్ట్.. ఐటీఆర్‌లో ఆ వివరాలను వెల్లడించకుంటే రూ. 10 లక్షల జరిమానా..!
X

దిశ, వెబ్‌డెస్క్: పన్ను చెల్లింపుదారులకు(Taxpayers) ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department) కీలక హెచ్చరికలు జారీ చేసింది. విదేశీ ఆస్తులు లేదా విదేశాల నుండి సంపాదించిన ఆదాయాన్ని తమ ఐటీఆర్‌(ITR)లో వెల్లడించడంలో ట్యాక్స్ పేయర్స్ విఫలమైతే ₹10 లక్షల జరిమానా విధిస్తామని తెలిపింది. ఈ మేరకు ట్యాక్స్ పేయర్స్ కు సహాయం అందించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) 'కంప్లయన్స్-కమ్-అవేర్‌నెస్ క్యాంపెయిన్‌ను(compliance-cum-awareness campaign)' ప్రారంభించింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్‌లో ఫారిన్ అసెట్స్ వివరాలను నమోదు చేయాలని పన్ను చెల్లింపుదారులను సూచించింది. విదేశీ ఆస్తులు, ఆదాయాన్ని బహిర్గతం చేయని పక్షంలో రూ.10లక్షల జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది. కాగా ఇప్పటికే ఐటీఆర్‌ను దాఖలు చేసిన ట్యాక్స్ పేయర్స్ కు క్యాంపెయిన్‌లో భాగంగా SMS, ఈ-మెయిల్స్‌ ద్వారా సమాచారం అందించినట్లు CBDT పేర్కొంది. ఆదాయపు పన్ను రిటర్న్స్(IT Returns)లో విదేశీ ఆస్తుల వివరాలను ఇవ్వని వారికి గుర్తు చేయడమే ఈ ప్రచారం ఉద్దేశమని తెలిపింది. కాగా ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31గా గడువు నిర్ణయించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed