Ministers: మహరాష్ట్ర నుంచే ఆ విధానానికి చెక్ పడాలి

by Gantepaka Srikanth |
Ministers: మహరాష్ట్ర నుంచే ఆ విధానానికి చెక్ పడాలి
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) నాందేడ్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ఇండియా కూటమి గెలవడం వలన, భవిష్యత్‌లో రాహుల్ గాంధీ(Rahul Gandhi) పీఎం అయ్యేందుకు మార్గం సులువుగా ఉంటుందని అన్నారు. దేశ వ్యాప్తంగా కార్పొరేట్ పాలన పోవాలని, మహరాష్ట్ర నుంచే ఆ విధానానికి చెక్ పడాలని వివరించారు. పేదోళ్ల కడుపు కొట్టి, పెద్దోళ్లకు పెద్దపీఠ వేస్తున్న మోడీ, అమిత్​షాల బీజేపీని పాతరేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ కాపాడాలంటే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.

గతంలో బీజేపీ ప్రజాస్వామ్యంలోని ప్రజల తీర్పును కించపరిచిందని, మహారాష్ట్రలో ప్రభుత్వాలను ఏ విధంగా కూల్చారో? మరోసారి గుర్తు చేసుకోవాలని కోరారు. ప్రజల అభిప్రాయాలను తుంగలో తొక్కి, కార్పొరేట్ వ్యవస్థను పెంచేందుకు బీజేపీ ఏక్ నాథ్ షిండేలను తయారు చేసిందన్నారు. ఇప్పుడు ఏ రాష్ట్రంలోకి వెళ్లినా, ప్రభుత్వాలను కూల్చాలంటే ఏక్ నాథ్​షిండే రావాలని వ్యంగ్యంగా విమర్శలు చేస్తున్నారని వివరించారు. ఇది మహారాష్ట్రకు అగౌరవంగా ఉన్నదన్నారు. కాంగ్రెస్ కూటమి అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed