అయ్యప్ప స్వామి దీవెనలు ప్రజలపై ఉండాలి

by Naveena |
అయ్యప్ప స్వామి దీవెనలు ప్రజలపై ఉండాలి
X

దిశ, చండూరు : అయ్యప్ప స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా ఉండి సుఖసంతోషాలతో జీవించాలని హరి హరపుత్ర అయ్యప్ప స్వామిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చండూరు మున్సిపల్ పరిధిలోని లక్కీనేని గూడెంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్ యాదవ్ శుక్రవారం నిర్వహించిన అయ్యప్ప పడి పూజా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. 18 పడిమెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతిని వెలిగించారు .అయ్యప్ప స్వామికి పంచామృతలతో అభిషేకం నిర్వహించారు. స్వామివారిని స్మరిస్తూ భజన కీర్తనలు ఆలపించారు. అనంతరం భక్తులు తీర్ద ప్రసాదాలను స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed