INC: కేటీఆర్ లాగే హరీష్ రావుకూ మతి భ్రమించింది.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ హాట్ కామెంట్స్

by Ramesh Goud |
INC: కేటీఆర్ లాగే హరీష్ రావుకూ మతి భ్రమించింది.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) నిజంగా తప్పు చేయకుంటే ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్(Congress MLC Balmoor Venkat) అన్నారు. మీడియాతో బీఆర్ఎస్ నేత హరీష్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఆయన.. ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికే ఫార్ములా ఈ రేస్(Formula E-Race) తీసుకొచ్చామని హరీష్ రావు(Harish Rao) అంటున్నారని, కానీ ప్రొసీజర్ ప్రకారం వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని, అక్రమాలకు పాల్పడుతూ ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టే అసెంబ్లీలో చర్చ పెట్టమన్నారని తెలిపారు. నియమ నిబంధనలు పాటించలేదు అంటేనే అందులో అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా అర్థం అవుతుందని అన్నారు.

దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది కాబట్టి స్పష్టమైన విచారణ జరిగి, తప్పు ఎవరు చేశారు అనేది బయటపడుతుందని చెప్పారు. కానీ విచారణకు సహకరించకుండా, తమ కుటుంబసభ్యుడు జైలుకు పోతాడని.. రైతులపై చర్చలో కూడా పాల్గొనలేదంటే తెలంగాణ ప్రజలపై మీ నిర్లక్ష్య వైఖరి ఈ రోజు స్పష్టమైందని ఆరోపించారు. నిజంగా మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారని, గతంలో ఓ ప్రెస్ మీట్ లో కేటీఆర్(KTR).. తప్పు చేయకపోతే ఆణిముత్యాల్ల బయటికి రావాలని అన్నారని, ఈ మాటలు ఆయనకు వర్తించవా అని నిలదీశారు. పథకాల పేరుతో మీరు చేసిన అన్ని స్కాముల్లో తప్పకుండా విచారణ జరుగుతుందని, తప్పు చేసిన వారు ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. కేటీఆర్ లాగా హరీష్ రావు కూడా మతి భ్రమించి మాట్లాడుతున్నాడని బల్మూర్ వెంకట్ విమర్శలు చేశారు.

Next Story

Most Viewed