Prithvi Shaw : పృథ్వీ షాపై ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ అధికారి సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |
Prithvi Shaw : పృథ్వీ షాపై ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ అధికారి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : పృథ్వీ షా ఫిట్‌నెస్, ప్రవర్తన, క్రమశిక్షణ బాగా లేవని ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. విజయ్ హజారే ట్రోఫీ స్క్వాడ్‌లో తన పేరు లేకపోవడంతో ఇటీవల షా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘దేవుడా.. నేనింకా ఏం చేయాలంటూ’ ఎమోషనల్ అయ్యారు. ఈ పోస్టుపై ఎంసీఎ అధికారి జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేవలం పది మంది ఫీల్డర్లతోనే బరిలోకి దిగాం. పృథ్వీ షా తన పక్క నుంచి బంతి వెళ్లినా పట్టుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. బ్యాటింగ్ సమయంలో సైతం బంతిని చేరుకోవడంలో షా విఫలం అయ్యాడు. ఫిట్‌నెస్, క్రమశిక్షణ లేకపోవడంతోనే ఆయనను విజయ్ హజారే ట్రోఫీకి సెలక్ట్ చేయలేదు. అందరూ ప్లేయర్లకు ఇదే రూల్ వర్తిస్తుంది. పృథ్వీ షా ప్రవర్తన పట్ల జట్టులోని సీనియర్ ఆటగాళ్లు సైతం ఫిర్యాదులు ఇవ్వడం ప్రారంభించారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా జట్టు శిక్షణలో పాల్గొంటే షా మాత్రం రాత్రంతా బయటకు వెళ్లేవాడు. ఉదయం 6 గంటలకు తిరిగి హోటల్‌కు వచ్చేవాడు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అవి ముంబై సెలక్టర్లు, ఎంసీఏపై ప్రభావం చూపుతాయనుకోవడం తప్పు. పృథ్వీ షా తనకి తానే శత్రువులా మారుతున్నాడు.’ అని ఎంసీఏ సీనియర్ అధికారి అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed