- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చెడిపోయిన రెండు క్వింటాళ్ల మేక, గొర్రె మాంసం స్వాధీనం

దిశ, చార్మినార్ : హోల్ సేల్ మార్కెట్ నుంచి చెడిపోయిన గొర్రె, మేక మాంసంతో పాటు సౌధలను తక్కువ ధరకు కొనుగోలు చేసి హోటళ్లకు, ఫంక్షన్లకు సరఫరా చేసే ఓ కేంద్రంపై సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చార్మినార్ జోన్ వెటర్నరీ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. నిలువ ఉంచిన గొర్రె, మేక మాంసంతో పాటు కాళ్లు, మెదడు, తల నుంచి భరించలేని దుర్వాసన వ్యాపించడంతో రూ.1.50లక్షలు విలువ చేసే రెండు క్వింటాళ్ల చెడిపోయిన మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగర టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస్ రావు తెలిపిన వివరాల ప్రకారం .... పాతబస్తీ డబీర్ పురా మాతాకీ కిడికీ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ మిస్బాహుద్దీన్ (24) గత కొంత కాలంగా మటన్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే చనిపోయిన, చెడిపోయిన గొర్రె, మేకల మాంసంతో పాటు కాళ్లు, తల, నాలుక, మెదడు లను తక్కువ ధరకు కొనుగోలు చేసి, స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ గోదాంలో పెద్ద ఎత్తున నిల్వ ఉంచేవాడు. శుభ, అశుభ కార్యాలతో పాటు ఈవెంట్స్, హోటళ్ళ నుంచి వచ్చే ఆర్డర్ల ద్వారా ఎక్కువ ధరకు విక్రయించేవాడు.
చెడి పోయిన గొర్రె, మేక మాంసంతో పాటు సౌదలను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. దీంతో విశ్వసనీయ సమాచారం మేరకు నగర టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్ .సైదా బాబు ఆధ్వర్యంలో ఎస్ఐలు పి.సాయిరాం, ఎస్కె కవియుద్దీన్, ఎం.మధు బృందం చార్మినార్ జోన్ వెటర్నరీ అధికారులతో కలిసి దాడులు మొహమ్మద్ మిస్బాహుద్దీన్ కు చెందిన గోదాంపై దాడులు నిర్వహించారు. పెద్ద ఎత్తున ఫ్రిజ్ లో గొర్రె, మేక మాంసంతో పాటు వాటి సౌధాలు ఉన్నట్లు గుర్తించారు. వాటి నుంచి భరించలేని దుర్వాసన వెదజల్లడంతో సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 2 క్వింటాళ్ల చెడిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును డబీర్ పురా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.