- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ హామీపై అసెంబ్లీ సాక్షిగా చేతులెత్తేసిన కాంగ్రెస్.. మాజీ మంత్రి హాట్ కామెంట్స్

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీ (Loan waiver) పై చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) రాష్ట్ర రైతాంగాన్ని దారుణంగా మోసం చేసిందని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ (BRS Leader Harish Rao) మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly Session) భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు (Agricultur Minister Thummala Nageshwar Rao) రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) నిర్ణయం ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేశామని ప్రకటించారు. దీనిపై హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
దీనిపై ఆయన.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రకటనతో రుణమాఫీ కథ ముగించే కుట్ర చేస్తున్నారని స్పష్టమవుతున్నది అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాటలు విని రెండు లక్షల పైన రుణం ఉన్న రైతులు అప్పు చేసి, మిత్తితో సహా బ్యాంకులకు కట్టారని తెలిపారు. అలాగే తమకు రుణమాఫీ ఎప్పుడు అవుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారని, బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని చెప్పారు. ఈరోజు వ్యవసాయ మంత్రి ప్రకటనతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయ్యిందని, రెండు లక్షల లోపు రుణ మాఫీ కాని వారి పరిస్థితి, రెండు లక్షల పైన రుణం ఉండి మాఫీ కాని రైతుల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు.
నమ్మి ఓటేసిన పాపానికి నయవంచన చేసింది కాంగ్రెస్ సర్కారు అని, ఇలాంటి అసంబద్ధ ప్రకటన పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యావత్ తెలంగాణ ప్రజలకు, రైతులకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. అంతేగాక ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులందరికీ రుణమాఫీ చేసి తీరాలని అన్నారు. రైతులను దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ (BRS) నిలదీస్తూనే ఉంటుందని, అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఇక రుణమాఫీ హామీ అమలును ప్రణాళిక ప్రకారం అటకెక్కించే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సిద్దిపేట ఎమ్మెల్యే (Siddipet MLA) హెచ్చరించారు.