త్వరలోనే అన్ని అంశాలు కొలిక్కి వస్తాయి.. కాంగ్రెస్ పెద్దలతో భేటీపై పీసీసీ చీఫ్

by Ramesh Goud |
త్వరలోనే అన్ని అంశాలు కొలిక్కి వస్తాయి.. కాంగ్రెస్ పెద్దలతో భేటీపై పీసీసీ చీఫ్
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ (Delhi) లోని ఇందిరా భవన్ (Indira Bhavan) లో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. ఏఐసీసీ నేతలు (AICC Leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi), మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Karge), కేసీ వేణుగోపాల్ (KC Venugopal) లతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు (Telangana Congress Leaders) సీఎం రేవంత్ రెడ్డి (CM revath Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy), టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) కాంగ్రెస్ జాతీయ కార్యాలయంలో సమావేశం అయ్యారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాలపై పలు కీలక విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణ పై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.

కాంగ్రెస్ పెద్దలతో జరుగుతున్న భేటీలో మంత్రి ఉత్తమ్ ముందుగానే బయటికి వచ్చారు. ఈ సమావేశం అనంతరం పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై చర్చ జరిగిందని తెలిపారు. అలాగే కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకం పై చర్చ జరిగిందని అన్నారు. అంతేగాక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం గురించి ఖర్గే, రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారని, ఆహారం, విద్యా వ్యవహారాలపై కూడా ఆరా తీశారని తెలిపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుపై వివరణ అడిగారని చెప్పారు. అన్నీ అంశాలపై సమగ్ర సమాచారం తీసుకున్నారని, త్వరలోనే అన్ని అంశాలు కొలిక్కి వస్తాయని ఆశిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

Next Story