- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్లాట్ల క్రమబద్దీకరణకు చివరి మూడు రోజులే అవకాశం
by Naveena |

X
దిశ, గద్వాల కలెక్టరేట్ : ఎల్ఆర్ఎస్ స్కీం క్రింద ప్లాట్ల క్రమబద్ధీకరణ కొరకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల కొరకు ప్రభుత్వం కల్పించిన 25 శాతం రిబేట్ ఈనెల 31వరకు అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఎల్ ఆర్ ఎస్ ప్లాట్ల క్రమబద్ధీకరణకు మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉన్నందున జిల్లాలోని అన్ని మున్సిపల్ గ్రామ పంచాయతీలలో ఫీజును చెల్లించి, తమ ప్లాట్లను క్రమబద్దీకరించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గడువు ముగిసిన తర్వాత 25 శాతం రిబేటు వర్తించదని తెలిపారు. ఈ అవకాశం కొద్ది రోజులే ఉన్నందున దీనిని సద్వినియోగం చేసుకోనాలన్నారు. చెల్లింపులు చేసిన వారికి రెండు లేదా మూడు రోజులలో అనుమతులు మంజూరు చేయబడతాయని తెలిపారు.
Next Story