- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
శాసన సభలో రెండు కీలక బిల్లులకు ఆమోదం

దిశ, తెలంగాణ బ్యూరో : శాసనసభలో రెండు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. సోమవారం శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలంగాణ పురపాలక సంఘాల సవరణ బిల్లు, మంత్రి సీతక్క తెలంగాణ పంచాయతీ రాజ్సవరణ బిల్లును ప్రవేశ పెట్టారు. సభ్యుల సూచనలు సలహాలు పొందిన తరువాత బిల్లులకు సభలో ఆమోదం లభించింది. ఈసందర్భంగా మంత్రులు ప్రసంగిస్తూ రాష్ట్రంలో కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దానికి విపక్ష పార్టీలకు చెందిన సభ్యులను తమ సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. వెంటనే బీఆర్ఎస్సభ్యులు చామకూర మల్లారెడ్డి, వివేకానంద, మల్రెడ్డి రంగారెడ్డి గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసే నిర్ణయం హర్షనీయమని, భవిష్యత్తులో నగర శివారు మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీ విలీనం చేయవద్దని కోరారు.
అనంతరం కూనంనేని సాంబశివరావు, ప్రభాకర్‌రెడ్డి, మందుల శ్యామేల్, రాంచందర్నాయక్మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలకు నిధుల కేటాయింపులతో పాటు సిబ్బంది నూతన భవనాలు నిర్మించాలని కోరారు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా మున్సిపాలీటీలు ఏర్పాటు చేసిందని, అందులో ఏలాంటి సౌకర్యాలు లేకుండా సంబంధంలేని గ్రామాలను విలీనం చేసి నిధులు ఇవ్వకుండా చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈప్రభుత్వం మున్సిపాలిటీ అభివృద్దికి సరిపడ్డ నిధులు కేటాయించి ఉత్తమ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దాలని కోరారు.
అభివృద్ది, సంక్షేమం కోసమే గ్రామాలు విలీనం, ఏర్పాటు ప్రక్రియ : మంత్రి సీతక్క
రాష్ట్రంలో 79 గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయనున్నట్లు, మున్సిపాలిటీల్లో విలీనమైన కొన్ని గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సీతక్క సభలో ప్రకటించారు. మేజర్గ్రామపంచాయతీలో ఉన్న వాటిని సొంత పంచాయతీలుగా చేస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా కొన్ని గ్రామాలకు పేర్లు తప్పరావడం, దూరంగా ఉన్న గ్రామాల్లో కలిపి వాటిని కొత్త పంచాయతీలుగా చేయనున్నట్లు తెలిపారు. వెంటనే విపక్ష పార్టీల సభ్యులు సునీతా లక్ష్మారెడ్డి, అనిల్‌జాదవ్, నాగరాజు బిల్లు తీసుకరావడం హర్షనీయమన్నారు. కొత్త ఏర్పడే వాటికి తగిన సదుపాయాలు కల్పించడంతో పాటు పంచాయతీలకు తగిన సిబ్బందిని నియమించి పారిశుద్ద పనులపై నిర్లక్ష్యం జరగకుండా చూడాలని కోరారు. వెంటనే మంత్రి స్పందిస్తూ గత పాలకుల కారణంగానే గ్రామాలు నిర్యక్షానికి గురైనట్లు తమ ప్రభుత్వం గ్రామాలను అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.