- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Pithapuram:‘అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి’.. షాకింగ్ వీడియో షేర్ చేసిన వర్మ!

దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం జగ్గయ్య కాలనీలో పారిశుధ్యం లోపించిందని ఆరోపిస్తూ దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఈ క్రమంలో అధికారుల నిర్లక్ష్యంతో ఆ ప్రాంతంలోని స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ మాట్లాడుతూ.. ‘కార్యకర్తే అధినేత’ కార్యక్రమంలో కార్యకర్తలు నా దృష్టికి తీసుకు వచ్చిన జగ్గయ్య చెరువులో ఉన్న ప్రభుత్వ అపార్ట్మెంట్లను సందర్శించానని తెలిపారు. వాటర్ ట్యాంక్ క్లీనింగ్, చుట్టుపక్కల శానిటేషన్, పైపుల లీకేజీ గురించి తెలుసుకున్నానని చెప్పారు. పిఠాపురం మున్సిపాలిటి శానిటేషన్ చేయకపోవడంతో అపార్ట్మెంట్‌ల చుట్టూ దుర్గన్నంతో డ్రైన్లు బ్లాక్ అయిపోయి, చెత్త చెదారంతో నిండిపోయాయని తెలిపారు.
ఈ క్రమంలో పిల్లల, కాలనీ వాసులు జ్వరాలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టిక్ ట్యాంక్‌లు క్లీనింగ్ లేక ట్యాంకులు నిండిపోయి, అవి పొంగిపొర్లి చుట్టుపక్కల నివాసం ఉండడానికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. పై నుంచి వచ్చే డ్రైనేజ్ పైపులు మంచినీళ్లు పైపులు అన్నీ కూడా పగిలిపోయి లీక్ అవుతుంది. అపార్ట్మెంట్ పైనున్న వాటర్ ట్యాంక్స్ కూడా ఎప్పుడు కూడా క్లీనింగ్ చేయట్లేదు. అదే విధంగా కలుషితంతో కూడిన మంచినీళ్లు తాగుతున్నారు.
ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటున్నారు. దాదాపు 250 కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇదే సమస్యలను గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని వర్మ తెలిపారు. ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వర్మ ఈ వీడియోను షేర్ చేశారన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరందుకుంది. టీడీపీ, జనసేన అభిమానులు సైతం కామెంట్ల యుద్ధం చేస్తున్నారు.
https://x.com/SVSN_Varma/status/1905594858167042403