నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టింది ఆయనే.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

by Shiva |
నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టింది ఆయనే.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మొట్టమొదటిసారి నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబు (CM Chandrababu) అని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ (Gottipati Ravi Kumar) అన్నారు. ఇవాళ ఆయన వినుకొండ (Vinukonda)లో నిర్వహిస్తున్న ఎడ్ల పందాల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. పట్టిసీమ (Pattiseema)తో గోదావరి నది (Godavari River) జలాలను కృష్ణా (Krishna)కు తీసుకొచ్చి రాయలసీమ (Rayalaseema) ప్రజల కష్టాలను తీర్చారని అన్నారు. ఇక పోలవరం (Polavaram) - బనకచర్ల (Banakacharla) అనుసంధానంతో ప్రతి ఎకరానికీ నీరందించే ప్రణాళికను కూడా సిద్ధం చేశారని తెలిపారు. రైతుల కష్టాలు తీర్చే ఈ ప్రాజెక్టుకు పార్టీలకు అతీతంగా అందరూ తమ సంపూర్ణ మద్దతును ఇవ్వాలని గొట్టిపాటి పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed