- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Assembly: కూట్లో రాయి తీయనోడు.. ఏట్లో తీస్తడా..!

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా సోమవారం సభలో ఉదయం అధికార, విపక్షాల డైలాగ్ వార్నడిచింది. సభ ప్రారంభం కాగానే బడ్జెట్ పద్దులపై చర్చించేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్సభ్యులకుఅవకాశం ఇచ్చారు. ‘‘కూట్లో రాయి తీయనోడు.. ఏట్లో తీస్తడా?.. నగర అభివృద్ధిపై కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తున్నది” అని బీఆర్ఎస్ఎమ్మెల్యే వివేకానంద విమర్శలు గుప్పించారు. అలాగే, రైతు రుణమాఫి.. నిధుల మంజూరుల విషయంలో సర్కారు తీరుపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్శంకర్ఫైర్ అయ్యారు. కాగా, ప్రతిపక్ష సభ్యుల వాదనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తనదైన శైలిలో కౌంటర్ ఏటాక్చేశారు. రైతులను మోసం చేసినోళ్లు, దగా చేసి ముంచిన వాళ్లు ఇవాళ రుణమాఫీ గురించి మాట్లాడితే ప్రజలు అసహ్యించుకుంటారని, అపహాస్యం పాలవుతారని మంత్రి పేర్కొన్నారు.
లక్షల కోట్లు పెట్టి ఒలింపిక్స్ తీసుకొస్తానడం జోక్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే
ఫార్ములా ఈ రేసులో 50 కోట్ల రూపాయలకే గొడవ చేసిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు లక్షల కోట్లు పెట్టి ఒలింపిక్స్ తీసుకొస్తానడం జోన్అని కుత్బుల్లాపూర్బీఆర్ఎస్ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కూట్లో రాయి తీయనోడు.. ఏట్లో తీస్తదా అని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీకి రూ.2,654 కోట్లు కేటాయిస్తే రూ.1,200 కోట్లే మంజూరు చేశారన్నారు. ఓఆర్ఆర్ రుణానికి రూ.2 వేల కోట్లు, డెవలప్మెంట్పనులకు రూ.500 కేటాయించారని చెప్పారు. ఓఆర్ఆర్ రుణం, అభివృద్ధికి హెచ్ఎండీఏకు నిధులు కేటాయించినా వాటిని ఖర్చు చేయలేదని విమర్శించారు. జలమండలికి రూ.3,385 కోట్లు కేటాయిస్తే.. రుణాలకే రూ.800 కోట్లు మంజూరు చేశారన్నారు. రాయదుర్గం నుంచి నడిచే మెట్రో సర్వీసును రద్దు చేశారని, పాతబస్తీ నుంచి చేపట్టిన మెట్రోకు రూ.1100 కోట్లు కేటాయిస్తే రూ.300 కోట్ల కంటే తక్కువే ఇచ్చారు. మూసీ సుందరీకరణకు రూ.1500 కోట్లు కేటాయిస్తే రూ.80 కోట్లే విడుదల చేశారని విమర్శించారు. గతేడాది కేటాయించిన నిధుల్లో కేవలం 25 శాతమే విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధిని విస్మరించి, పూర్తి నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు.
ప్రజల్లో అపహాస్యం పాలవుతారు: మంత్రి తుమ్మల
రుణ మాఫీ విషయంలో ప్రతిపక్షలు చేసిన విమర్శలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కౌంటర్ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు విడతల వారీగా రుణమాఫీ చేస్తే వడ్డీలకే సరిపోలేదని విమర్శించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎన్నికలకు మూడు నెలల ముందు రుణమాఫీ ప్రారంభించగా, అందులో సగం మందికి రుణమాఫీ కాకపోతే ఆ భారాన్ని కూడా తమ కాంగ్రెస్ ప్రభుత్వమే భరించిందన్నారు. కుటుంబానికి రూ. 2 లక్షల పంట రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం అని, దానిలో భాగంగానే ఈ రోజు వరకు రూ. 20 వేల కోట్లు రిలీజ్ చేశామని మంత్రి వెల్లడించారు. మార్చి 31లోపు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. రైతులను మోసం చేసినవాళ్లు, దగా చేసినవాళ్లు, ముంచిన వాళ్లు రుణమాఫీ గురించి మాట్లాడితే ప్రజలు, అసహ్యించుకుంటారని, ప్రజల్లో అపహాస్యం పాలవుతారని మంత్రి పేర్కొన్నారు. ఇదిలాఉండగా ప్రతిపక్షాలు విమర్శలు తప్ప, సూచనలు చేయడ లేదని ప్రభుత్వ విప్ఆది శ్రీనివాస్పేర్కొన్నారు. పెట్టుబడిదారులను బెదిరించేలా బీఆర్ఎస్నేతలు మాట్లాతున్నారని మాత్రమే సీఎం అన్నారు. సీఎం వ్యాఖ్యలను బీఆర్ఎస్సభ్యులు వక్రీకరించి మాట్లాతున్నారనని ఆయన వ్యాఖ్యనించారు.
ఇలాంటి పరిస్థితి ఊహించలేదు: పాయల్ శంకర్
పదకొండు ఎండ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఇంతటి పరిస్థితి వస్తుందని ఊహించలేదని బీజేపీ ఎమ్మెల్యే పాయలశంకర్ అన్నారు. రైతుల రుణమాఫీ విషయంలో ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికీ సంపూర్ణంగా రుణమాఫి జరగలేదని, ఎప్పటికీ పూర్తవుతుందో? ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్‌చేశారు. ఇంకా 3వేల కోట్లు ప్రభుత్వ ఖాతాలోనే ఉన్నాయని, ఒక ఇంట్లో ఒకే ఖాతా ఉన్నది.. రెండు లక్షల రూపాయల లోపు రుణం ఉన్నా.. మాఫీ కాలేదని విమర్శించారు. కలెక్టర్దగ్గరు వెళితే తమ దగ్గర ఏమీలేదని అంటున్నారని.. రైతులు ఇంకా హెల్ప్‌డెస్క్‌ల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దుబారాలకు పోయిందని, సీఎంఓలో పని చేసే అధికారులు 200 కిలోమీటర్ల ప్రయాణానికి హెలికాప్టర్ ప్రయాణాలు చేశారని విమర్శించారు. రుణమాఫీపై గతంలో బీఆర్ఎస్ మాట తప్పితే కాంగ్రెస్ అమలు చేస్తుందేమో? అని భావించామని, కానీ కేవలం రూ.20 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారని అన్నారు. అర్హత ఉన్నా అనేకమంది రైతులకు పంట రుణాలు మాఫీ కాలేదన్నారు. గత పాలకుల నిర్లక్షం వల్ల ఆదిలాబాద్ కు ఏవియేషన్ స్టేషన్ ఇప్పటి వరకు ఏర్పాటు కాకుండా పోయిందని విమర్శించారు. ఏయిర్ఫోర్సు స్టేషన్వస్తే పరిశ్రమలు వస్తాయి, అదేరకంగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిచాలన్నారు.
పాయల్శంకర్మాటలు అవాస్తవం: మంత్రి పొన్నం
బిల్లుల పద్దుల గురించి చర్చలో భాగంగా పాయల్శంకర్మాట్లాడుతూ.. మైనార్టీ కాలేజీల ఫీజ రీయింబర్స్ లో మైనార్టీలకు రంజాన్పండుగ సందర్భంగా విడుదల చేస్తామని, సంతోషంగా వేడుక చేసుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రే ప్రస్తావించారని పేర్కొన్నారు. మా వాళ్లు సైతం కాలేజీలు నడుపుతున్నారు.. మాకు ఉగాది పండుగ వస్తున్నది బకాయిలు విడుదల చేయాలని విమర్శించారు. దీనిపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్మాట్లాడుతూ.. ఆరోజు సీఎం రేవంత్‌రెడ్డి ఇమామ్.. మోజంలకు ఇచ్చేటువంటి మూడు నెలల పెండింగ్బకాయిల గురించి ప్రస్తావించారని పేర్కొన్నారు. అలాగే దేవాలయలకు అర్చకులకు ఇస్తున్నామని తెలిపారు. వాటిని కూడా వెంటనే క్లియర్‌చేయడం జరుగుతుందని, ఈ విషయంలో చర్చా అవసరం లేదన్నారు. కాలేజీల ఫీజుల రీయింబర్స్ మెంట్‌కు సంబంధించి కులం, మతం సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో అందరికి సమానంగానే అందజేయడం జరుగుతుందని. సభ్యులు అవాస్తవమైన మాటలు మాట్లాడవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ఈ సందర్భంగా పాయల్శంకర్కు సూచించారు.