- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చిల్లర రాజకీయాలు మానుకోవాలి: బండి సంజయ్‌కు కేపీ వివేక్ స్ట్రాంగ్ కౌంటర్

దిశ, తెలంగాణ బ్యూరో: బాధ్యత గల పదవిలో ఉండి బండి సంజయ్ కేసీఆర్‌ని విమర్శిస్తున్నారని, ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపి వివేకానంద, కల్వకుంట్ల సంజయ్ హితవు పలికారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో సోమవారం మాట్లాడారు. బండి సంజయ్ మాటలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుస్తుందని అన్నారు. తన పదవిని, దేశ గౌరవాన్ని దిగజార్చే విధంగా బండి సంజయ్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇలాంటి నాయకులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నీ భాష, ప్రవర్తన వల్ల ఒక తరం పిల్లలు చెడిపోతున్నారని అన్నారు. రెండుసార్లు కరీంనగర్ ప్రజలు ఎన్నుకుంటే చేసింది శూన్యం అని ఆరోపించారు. కరీంనగర్‌కు, రాష్ట్రానికి కావలసిన నిధులు తెచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. చిల్లర రాజకీయాలు మాని విద్యా, వైద్యము, ఉపాధి గురించి మాట్లాడాలని చెప్పారు.