షాకింగ్ ఘటన.. ప్రేమ పేరుతో నమ్మించి.. ప్రెగ్నెంట్ చేసి.. ఆపై!

by Jakkula Mamatha |
షాకింగ్ ఘటన.. ప్రేమ పేరుతో నమ్మించి.. ప్రెగ్నెంట్ చేసి.. ఆపై!
X

దిశ,వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని విశాఖపట్నం(Vishakapatnam)లోని AKC కాలనీలో ఓ యువకుడు(24) మూడేళ్ల నుంచి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో అక్కడే కుటుంబంతో కలిసి ఉంటున్న యువతి(19)తో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ తరుణంలో రోజురోజుకు ఇద్దరి మధ్య ప్రేమ(Love) మరింత బలపడింది. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చగా పెళ్లి చేసుకొమ్మని యువకుడిని అడిగితే అతను ముఖం చాటేశాడు. దీంతో నమ్మించి మోసం చేశాడని తెలుసుకున్న సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ యువకుడు(24) యువతి(19)ని నువ్వే నా ప్రాణం, నిన్నే ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించాడు. ఆ యువకుడి మాటలు నమ్మిన యువతి అతనితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో అతనితో కలిసి బయటకు వెళ్లడం, శారీరకంగా కలవడం వంటివి జరిగాయి. ఈ క్రమంలో ఆ యువతి 3 నెలల గర్భం దాల్చింది. ఈ విషయం ఆ యువతి ప్రియుడితో చెప్పి ‘నన్ను పెళ్లి చేసుకో’ అని అడిగింది. కానీ యువకుడు పెళ్లికి నిరాకరించాడు. ఏం చేయాలో తెలియక ఆ యువతి న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడిని విచారించగా.. పెళ్లి కుదరదు అని తేల్చి చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed