Viral News:ఈ తాబేలు ప్రయాణం.. ఒడిశా టు ముంబై వయా శ్రీలంక చివరికి ఎక్కడకి వచ్చిందంటే?.. ఇదంతా పిల్లల కోసమేనా!

by Jakkula Mamatha |   ( Updated:2025-04-17 07:34:51.0  )
Viral News:ఈ తాబేలు ప్రయాణం.. ఒడిశా టు ముంబై వయా శ్రీలంక చివరికి ఎక్కడకి వచ్చిందంటే?.. ఇదంతా పిల్లల కోసమేనా!
X

దిశ,వెబ్‌డెస్క్: జంతువులకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ తాబేలుకు సంబందించిన ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఓ ఆడ ఆలివ్ రిడ్లే తాబేలు ఒడిశా తీరం నుంచి శ్రీలంక, కేరళ సముద్ర మార్గంలో మహారాష్ట్రకు చేరింది. మొత్తం 4500 కిలోమీటర్లు ప్రయాణం చేసి ముంబైలోని గుహగర్ బీచ్ లో 125 గుడ్ల పై పొదుగుతోంది. ఈ విషయాన్ని మహారాష్ట్రకు చెందిన అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఈ తాబేలుకు గుర్తింపు సంఖ్యగా 03233 నంబరును కేటాయించినట్లు పేర్కొన్నారు.

అయితే.. ఆడ ఆలివ్ రిడ్లీ తాబేలు తూర్పు, పశ్చిమ తీరాలలో సంతానోత్పత్తి కోసం వేర్వేరు ప్రదేశాలలో తమ గూళ్ళను నిర్మించుకుంటాయి. ఆలివ్ రిడ్లీ తాబేళ్లు డిసెంబర్ నుంచి మార్చి వరకు అనేక బీచ్‌లలో గూడు కట్టుకుంటాయి. కానీ.. ఈ తాబేలు ఒకేసారి రెండు వేర్వేరు బీచ్‌లలో గూడు కట్టుకుని వాటి మధ్య ప్రయాణించడంతో శాస్త్రవేత్తలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మొదటగా అది ఒడిశా బీచ్‌లో గూడు కట్టింది. అనంతరం మహారాష్ట్ర బీచ్‌లో గూడు కట్టింది. ఆ తాబేలు ఒడిశా నుంచి శ్రీలంకకు, అక్కడి నుంచి మహారాష్ట్రలోని రత్నగిరికి ప్రయాణించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మొదటిసారి చూశాను..

వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. తాబేళ్లు తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరానికి వస్తాయని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది అరుదైన సంఘటనగా భావిస్తున్నాను. ఈ జాతిలో అలాంటి వలస సాధ్యమని మాకు తెలియదని తెలిపారు. ఆ తాబేలు శ్రీలంక చుట్టూ 4500 కి.మీ. దూరం ప్రయాణించింది. బహుశా రామేశ్వరం ద్వీపాన్ని తమిళనాడు ప్రధాన భూభాగానికి అనుసంధానించే పంబన్ కారిడార్ ద్వారా అది ప్రత్యామ్నాయ చిన్న మార్గాన్ని తీసుకుని ఉండవచ్చని ఆయన భావించారు.



Next Story

Most Viewed