ఒకరు బయటకు.. మరొకరు అదుపులోకి..: వైఎస్సార్ జిల్లాలో బిగ్ షాక్

by srinivas |   ( Updated:2025-03-22 15:57:13.0  )
ఒకరు బయటకు.. మరొకరు అదుపులోకి..: వైఎస్సార్ జిల్లాలో బిగ్ షాక్
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కడప జిల్లా(Ysr Kadapa District)లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ(Ycp) కార్యకర్తల్లో ఒకరు జైలు(Jail) నుంచి విడుదలైంది. మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో జిల్లాలో రెండు సంచలన ఘటనలు జరిగాయి.


అసభ్య పోస్టుల వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి(Varra Ravinder Reddy)ని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు పోలీసులు అరెస్ట్ చేసిన రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. ఈ మేరకు జగ్గయ్యపేట జైలు(Jaggayyapet Jail) నుంచి వర్రా రవీందర్ రెడ్డి విడుదల అయ్యారు.

ఇదిలా ఉంటే వైఎస్సార్ కడప జిల్లాకే చెందిన వైసీపీ కార్యకర్త పవన్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివేకానందారెడ్డి హత్య కేసు(Vivekananda Reddy murder case) నిందితుడు సునీల్ చేసిన ఫిర్యాదుతో పవన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం మధ్యాహ్నం పవన్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నించారు. అనంతరం కడప నుంచి పులివెందులకు తీసుకెళ్లారు. అయితే పులివెందులలోనే పవన్ కుమార్ ను మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.

Next Story