బిల్డింగ్​పై నుంచి పడి సెంట్రింగ్ ​కార్మికుడు మృతి

by Kalyani |
బిల్డింగ్​పై నుంచి పడి సెంట్రింగ్ ​కార్మికుడు మృతి
X

దిశ, వనస్థలిపురం: నిర్మాణంలో ఉన్న బిల్డింగ్​ పై నుంచి పడి ఓ సెంట్రింగ్​ కార్మికుడు చనిపోయిన ఘటన హయత్​నగర్ ​పోలీస్​స్టేషన్ ​పరిధిలో శనివారం జరిగింది. సీఐ నాగరాజు గౌడ్​ వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ ​నారాయణ పూర్ మండలం చిమిర్యాల గ్రామానికి చెందిన నర్సింహ్మ (50) సెంట్రింగ్​ కార్మికుడు. భార్య గాలమ్మ ముగ్గురు పిల్లలతో కలిసి .. నందనవనం కాలనీలో నివాసం ఉంటున్నారు. శనివారం హయత్​నగర్.. సాహెబ్​నగర్​కు సమీపంలో ​ కుమ్మరికుంట వెంకటేశ్వర కాలనీ .. రోడ్​ నంబర్ ​–3లో ఓ బిల్డింగ్​ నిర్మాణం నాలుగో ఫ్లోర్​కు సెంట్రింగ్​ పనులు చేస్తున్నారు.

ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడగా, తీవ్ర గాయాలై స్పాట్​లోనే చనిపోయాడు. దీంతో బంధువులు, స్థానిక ఏఐటీయూసీ ట్రేడ్​ యూనియన్​ నాయకులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అప్పటివరకు డెడ్​ బాడీనీ అక్కడి నుంచి తరలించేది లేదని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బిల్డింగ్​ యజమాని, బాధితులతో మాట్లాడి.. వారు సమ్మతించడంతో డెడ్​ బాడీని పోస్ట్​మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నర్సింహ్మ భార్య గాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజు గౌడ్​ తెలిపారు.

Next Story