- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జైపూర్లో అదనంగా 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్

దిశ, మంచిర్యాల : జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి సంస్థ థర్మల్ విద్యుత్ ప్లాంట్లో అదనంగా మంజూరైన మరో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శు క్రవారం జిల్లాలోని జైపూర్లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ పరిధిలో అదనంగా మంజూరైన 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ కు సంబంధిత శిలాఫలకం, హెలీప్యాడ్, బహిరంగ సభ ఏర్పాటు చేసే స్థలం వివరాలను జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ జీఎం, మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాస్ రావు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ వనజారెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జైపూర్లోని సింగరేణి విద్యుత్ ప్లాంట్లో 9 వేల 500 కోట్ల రూపాయల వ్యయంతో అదనంగా 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ మంజూరు అయిందని తెలిపారు. విద్యుత్ ప్లాంట్ పనులను రాష్ట్ర ప్రముఖులచే ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. సంబంధిత శాఖ అధికారులు త్వరగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.