- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కీలక పరిణామం.. భయ్యా సన్నీ యాదవ్ పై లుక్ ఔట్ నోటీసులు జారీ

దిశ, వెబ్ డెస్క్: ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్ (IPS officer Sajjanar) సూచన మేరకు సూర్యాపేట జిల్లా పోలీసులు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ (YouTuber Bhaiya Sunny Yada)పై కేసు నమోదు చేశారు. అయితే సన్నీ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో నూతనకల్ లోని అతని ఇంటికి నోటీసులు అంటించారు. ఈ నోటీసులు ఇచ్చి రెండు వారాలు గడుస్తున్నప్పటికీ అతని నుంచి ఎటువంటి విరణ లేకపోవడం అందుబాటులోకి రాకపోవడం తో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భయ్యా సన్నీ యాదవ్ పై లుక్ ఔట్ నోటీసులను (Lookout notices) నూతనకల్ పోలీసులు జారీ చేశారు. నిషేదిత బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ (Betting Apps Promotion) చేసినందుకు భయ్యా సన్నీ యాదవ్ పై నూతనకల్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదు అయింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతుండగా.. ఇందులో ప్రముఖులు గా ఉన్న హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
వీరు ముగ్గురు దుబాయ్ (Dubai) వెళ్లిపోయినట్లు వార్తలు వస్తుండగా.. చిట్టచివరగా వారు పెట్టి వీడియోలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దీంతో వారిని భారత్ రప్పించేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే నేడు నూతనకల్ పోలీసులు (Nutankal Police) భయ్యా సన్నీ యాదవ్ (Bhaiya Sunny Yadav) పై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇన్ఫ్యూలేన్సర్లమని చెప్పుకుంటు.. అమయకు యువకులను బెట్టింగ్ యాప్‌ల వైపు వెళ్లే విధంగా ప్రమోషన్స్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుల్లో సినీ ప్రముఖులు సైతం పోలీసుల విచారణకు హాజరయ్యారు. మరికొందరు తమకు తెలియకుండా ప్రమోషన్స్ చేశామని.. మరోసారి ఇలాంటి తప్పులు చేయబోమని సోషల్ మీడియా వేదికగా వీడియోలను విడుదల చేశారు.