- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Viral video: ప్రధాని మోడీ పెళ్లి వీడియో.. డ్యాన్స్ చేసిన రాహుల్, అమిత్ షాలు!

దిశ, వెబ్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence) టెక్నాలజీ అతి కొద్ది కాలంలోనే విపరీతంగా పాపులర్ అయింది. ఏ రంగంలో చూసిన దీని గురించే టాక్ వినిపిస్తోంది. ఏఐ తలుచుకుంటే ఏదైనా చేయగలదని, సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. ఇక ఏఐ ఫొటోస్.. ఏఐ వీడియోస్.. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి నెటిజన్లు తమకు ఇష్టమైన వారి ఫొటోలను, వీడియోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. పైగా ఆ ఫోటోలు, వీడియోలు చూస్తే ఒరిజినల్‌కు ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో తాజాగా ఏఐ క్రియేట్ చేసిన ప్రధాని మోడీకి (PM Modi) సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రధాని మోడీ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది. ఆయన పెళ్లిలో ఎవరెవరు పాల్గొంటారనే తదితర అంశాలతో ఏఐ ఓ వీడియోను క్రియేట్ చేసింది. ఇక భారత సంప్రదాయం ప్రకారం చాలా గ్రాండ్‌గా ఈ పెళ్లి వేడుకను రూపొందించింది ఏఐ. అంతేకాదు, ఈ వేడుకలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి అమిత్ షా కలిసి డ్యాన్స్ చేయటం, తదితర రాజకీయ నాయకులు సందడి చేయటం చూడొచ్చు. వీడియో చివర్లో ప్రధాని మోడీ సైతం రెండు స్టెప్పులేశారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు 'ఇట్లుంటది ఏఐతో' అని కొందరు, 'అరేయ్ ఎవరైనా దీన్ని ఆపండ్రా' అంటూ మరికొంత మంది కామెంట్లు పెడుతున్నారు.