- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీబీఐ ఏసీబీకి చిక్కిన సెంట్రల్ జీఎస్టీ అధికారి

దిశ, మెదక్ ప్రతినిధి : సెంట్రల్ జీఎస్టీ మెదక్ రేంజ్ సూపరింటెండెంట్ సీబీఐ, ఏసీబీ అధికారులకు చిక్కాడు. హైదరాబాద్ లోని సీబీఐ, ఏసీబీ అధికారి ధనుంజయ్ బృందం శుక్రవారం మెదక్ ఆటో నగర్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీఎస్టీ కార్యాలయంలో సూపరింటెండెంట్ రవి రంజాన్ అగర్వాల్ ను అవినీతికి పాల్పడటం తో అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కేంద్ర కార్యాలయం తలుపులు మూసి వేసి విచారణ జరిపారు. డబ్బులు తీసుకుంటూ చిక్కడా అనే విషయాలు అధికారులు వెల్లడించలేదు. బాధితుల వివరాలు కూడా సీబీఐ అధికారులు గోప్యంగా ఉంచారు. ఆరు గంటల విచారణ అనంతరం మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో అరెస్టు సమాచారం ఇచ్చి అదుపులోకి తీసుకొని హైదరాబాద్ లోని నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు అధికారులు చెప్పారు. అధికారి కుటుంబీకులకు సైతం సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఏ విషయం లో ఏసీబీ కి చిక్కాడు.. బాధితులు ఎవరు అనే పూర్తి సమాచారం మాత్రం చెప్పేందుకు సీబీఐ, ఏసీబీ అధికారులు నిరాకరించారు.