మున్సిపల్ కమిషనర్ డౌన్ డౌన్

by Sridhar Babu |
మున్సిపల్ కమిషనర్ డౌన్ డౌన్
X

దిశ,మేడ్చల్ టౌన్ : మేడ్చల్ పట్టణంలో నీటి సమస్య విపరీతంగా పెరిగిపోయిందని బాలాజీ నగర్, మర్రి రాజిరెడ్డి ,వెంకట్రామయ్య కాలనీ ప్రజలు మేడ్చల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ మిషన్ భగీరథ నీరు రావడం లేదని, నీటి ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నీటి సమస్య పరిష్కరించాలని కమిషనర్ నాగిరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఇదే సమస్యపై వివరణ కోరగా కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పారు. రానున్న మూడు రోజుల్లోగా ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

Next Story

Most Viewed