- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సమ్మర్ స్పెషల్‌గా రాబోతున్న సుహాస్.. పోస్టర్ వైరల్

దిశ, సినిమా: వైవిధ్యభరితమైన కథలు ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరో సుహాస్ (Suhas)నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓ భామ అయ్యో రామ’(Oh Bhama Ayyo Rama). లవ్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి రామ్ గోదాల (Ram Godala) దర్శకత్వం వహిస్తుండగా.. మాళవిక మనోజ్(Malavika Manoj) హీరోయిన్‌గా నటిస్తుంది. వి ఆర్ట్స్ బ్యానర్‌పై హరీష్ నల్ల నిర్మిస్తున్న ఈ మూవీలో.. అనిత హస్సానందని(Anita Hassanandani Reddy ), ఆలీ(Ali), రవీందర్ విజయ్, బబ్లు పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కరుమంచి, మొయిన్, సాత్విక్ ఆనంద్, నయని పావని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్.. ప్రేక్షకులను ఆకట్టుకోగా సినిమాపై పాజిటివ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా టీజర్ ఈనెల 24వ తేదీన, ఉదయం 11.07 గంటలకు రాబోతున్నట్లు తెలుపుతూ ‘కొంచెం పిచ్చి.. చాలా ప్రేమతో నిండిన మధురమైన దృశ్యాన్ని తీసుకువస్తున్నాము’ అనే క్యాప్షన్ ఇచ్చి ఓ పోస్టర్ విడుదల చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా.. సినిమా రిలీజ్ డేట్‌పై కూడా ఇంట్రెస్టింగ్ బజ్ వినపడుతోంది. ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అంతే కాకుండా.. టీజర్ రిలీజ్‌లోనే సినిమా విడుదలపై కూడా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.