Viral Video: సూపర్ ఐడియా బాబాయ్.. మార్కెటింగ్ అంటే ఇలా ఉండాలి!

by Gantepaka Srikanth |
Viral Video: సూపర్ ఐడియా బాబాయ్.. మార్కెటింగ్ అంటే ఇలా ఉండాలి!
X

దిశ, వెబ్‌డెస్క్: బిజినెస్(Business) చేసే వారిలో ఒక్కొక్కరికీ ఒక్కో స్ట్రాటజీ ఉంటుంది. ఎవరికి వారు వారి వారి ప్రొడక్ట్స్‌ను వినూత్నంగా మార్కెటింగ్ చేయాలి.. జనాలను ఆకర్షించాలి అని అనుకుంటారు. తాజాగా ఇలాంటి వీడియోనే సోషల్ మీడియా(social media)లో వైరల్‌గా మారింది. సమ్మర్ కావడంతో గ్రామాల్లో విస్తృతంగా ఐస్ క్రీములు(Ice Cream) అమ్మే వ్యక్తులు బైకులపై తిరగుతున్నారు. అయితే అమ్మే సమయంలో ఎవరైనా.. ‘ఐస్ క్రీమ్.. ఐస్ క్రీమ్’ అంటూ అరుస్తూ ఊర్లో తిరగడం చూశాం.. కానీ ఓ వ్యక్తి కాస్త వినూత్నంగా ఆలోచించాడు.

‘అరేయ్ పిల్లల్లారా బాగున్నార్రా.. ఐస్ క్రీమ్ బండి(Ice Cream Bandi) వచ్చింది. వెంటనే కొనుక్కొండి. డబ్బులు అమ్మను అడగండి. ఆమె ఇవ్వకపోతే నాన్నను అడగండి. ఆయన ఇవ్వకపోతే బామ్మను అడగండి. ఆమె ఇవ్వకపోతే తాతను అగడండి. ఆయనా ఇవ్వపోతే ఏడుస్తూ ఇంట్లోనే కూర్చోండి’ అని వాయిస్ రికార్డు్ చేసుకొని గ్రామాల్లో తిరుగుతున్నాడు. ఇది గమనించిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్త వైరల్‌గా మారింది. ఇది గమనించిన నెటిజన్లు ‘నీ ఐడియా సూపర్ బాబాయ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీడియో ఫన్నీగా ఉందంటూ మరికొందరు పేర్కొంటున్నారు.

Next Story

Most Viewed