- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
JAC Meeting Gifts: చెన్నై మీటింగ్ లో అతిథులకు స్టాలిన్ స్పెషల్ గిఫ్ట్ బాక్స్.. అందులో ఏమున్నాయంటే?

దిశ, డైనమిక్ బ్యూరో: డీలిమిటేషన్ విషయంపై చర్చించేందుకు ఇవాళ చెన్నై (Chennai) వేదికగా తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్ (CM Stalin) నేతృత్వంలో జేఏసీ తొలి మావేశం (JAC meeting) జరిగింది. ఈ సమావేశానికి హాజరైన నేతలకు సీఎం స్టాలిన్ అతిథి మర్యాదల్లో అదరగొట్టారు. వచ్చిన వారికి శాలువాలతో సత్కరించడంతో పాటు వారికి ప్రత్యేకమైన బహుమతులతో కూడిన బాక్స్ ను అందజేశారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేరళన సీఎం పినరయ్ విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు ఆయా పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ మీటింగ్ కు వచ్చిన వారందరిరికీ సీఎం ప్రత్యేకమైన గిఫ్ట్ బాక్సులు అందజేయడంతో అందులో ఏమున్నాయనే క్యూరియాసిటీ అందరిలో పెరిగిపోయింది.
జీఐ-సర్టిఫైడ్ గిఫ్ట్స్:
తమ ఆతిథ్యానికి గుర్తుగా మీటింగ్ కు హాజరైన వారికి తమిళనాడు (Tamil Nadu) స్వయం సహాయ బృందాల సభ్యులు రూపొందించిన ఆ రాష్ట్ర భౌగోళిక సూచిక జీఐ ట్యాగ్ చేయబడిన ఉత్పత్తులతో (GI-Certified) కూడిన గిఫ్ట్ బాక్స్ లను స్టాలిన్ అందజేశారు. అందులో తామిరపరణి నది ఒడ్డున కళాకారులు కోరై గడ్డితో నేసిన సంప్రదాయ పత్తమడై మ్యాట్, నీలగిరిలోని తోడా గిరిజనుల చేతితో తయారు చేసిన తోడా ఎంబ్రాయిడరీ శాలువా, కాంచీపురం సిల్క్ చీర, ఊటీ వర్కీ (ఊటీ నుంచి వచ్చిన క్రిస్పీ బిస్కెట్ లాంటి చిరుతిండి), వాసన, రుచికి ప్రసిద్ధి చెందిన కన్యాకుమారి లవంగాలు, వేరుశెనగ, బెల్లం, ఏలాకులతో తయారు చేసిన కోవిల్ పట్టి కడలై మిట్టై (వేరుశెనగ మిఠాయి), మంచి రంగు, ఔషధ లక్షణాలు ఉన్న ఈరోడ్ మంజల్(పసుపు), కొడైకెనాల్ కొండల్లో పెరిగి రుచి, ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన కొండ వెల్లుల్లి వస్తువులతో కూడిన గిఫ్ట్ బాక్స్ ను అందజేశారు. ఇందులో ఉన్న ప్రతి వస్తువు తమిళనాడు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంతో పాటు స్థానిక చేతివృత్తులవారి వారికి జీవనోపాధికి మద్దతు, చేతిపనులను సంరక్షించడంలో నిబద్ధతను నొక్కి చెప్పేలా తమిళనాడు సీఎం తమ అతిథులకు ఈ బహుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది.