ఎలమంచిలి శ్రీనివాస్ శవ రాజకీయాలు చేస్తున్నారు..కాసుల బాలరాజు

by Sumithra |
ఎలమంచిలి శ్రీనివాస్ శవ రాజకీయాలు చేస్తున్నారు..కాసుల బాలరాజు
X

దిశ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఇక్బాల్ అనారోగ్యంతో మరణించారని, ఆయన మరణానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కారణమని చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేశారు. ఇక్బాల్ గత నాలుగు నెలలుగా పక్షవాతంతో అనారోగ్యంతో బాధపడుతూ హృద్రోగంతో మరణించారని, ఈ విషయాన్ని రాజకీయం చేయడం సరికాదని కాసుల బాలరాజు అన్నారు.

ఇక్బాల్ తీసుకున్న కాంట్రాక్టు పనిని ఎమ్మెల్యే రద్దు చేయించడం వల్లనే ఆయన మరణించారని ఎలమంచిలి శ్రీనివాస్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని బాలరాజు హితోపదేశం చేశారు. ఇక్బాల్ మృతి దురదృష్టకరమని, ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని బాలరాజు అన్నారు. ఎలమంచలి శ్రీనివాస్ శవ రాజకీయాలు చేస్తున్నారని, ఈ విషయమై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఆయన ప్రకటించారు. ఆయనతో పాటు బీర్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు, శ్రీనివాస్ రెడ్డి, నార్ల సురేష్, మధుసూదన్ రెడ్డి, హన్మండ్లు, గౌస్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed