- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్‌తో రొమాన్స్ చేయబోతున్నమెగా బ్యూటీ.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ‘సీతారామం’(Sita Ramam) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాడు. మృణాల్ ఠాకూర్ హీరో యిన్‌గా నటించిన ఈ మూవీ 2022లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అన్ని భాషల్లో దుల్కర్ క్రేజ్ పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత నటించిన ‘కింగ్ ఆఫ్ కోత’డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ గత ఏడాది ‘లక్కీ భాస్కర్’(Lucky Bhaskar)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకీ అట్లూరి (Venky Atluri)దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. అయితే ఇందులో మీనాక్షి చౌదరిబ హీరోయిన్‌గా నటించింది. ఇక అక్టోబర్ 31న వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టడంతో పాటు ప్రేక్షకులను మెప్పించింది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం దుల్కర్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సల్మాన్(Salman), సాత్విక వీరవల్లి కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలుగు సినిమాగా రాబోతుండగా.. దీనిని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా పూర్తి కావడంతో షూటింగ్ మొదలు పెట్టారు. దీంతో సినీ ప్రియులంతా ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka Tara)నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘ఆకాశంలో ఒక తార’ మూవీలో దుల్కర్ సరసన రుహాణి శర్మ (Ruhani Sharma)హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో సినిమా ఫ్లాప్ అవుతుందని అభ్రిప్రాయపడుతున్నారు. కాగా.. ఈ అమ్మడు ‘చీలసౌ’మూవీతో ఇండస్ట్రీకి వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. ఇక వెంకటేష్ నటించిన ‘సైంధవ్’సినిమాతో హిట్ సాధించడంతో వరుణ్ తేజ్ సరసన నటించే చాన్స్ అందుకుంది. ఇక గత ఏడాది ‘బ్యాక్ అవుట్’ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు ఎలాంటి ప్రాజెక్ట్స్ లేకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తోంది.