మొదటిరోజు టెన్త్ పరీక్షలో 30 మంది గైర్హాజర్

by Sridhar Babu |
మొదటిరోజు టెన్త్ పరీక్షలో 30 మంది గైర్హాజర్
X

దిశ, ఆదిలాబాద్ : మొదటిరోజు ప్రారంభమైన పదవ తరగతి వార్షిక పరీక్షలలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 30 మంది విద్యార్థులు గైరాజరయ్యారు. మొత్తం 10043 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా జిల్లాలోని 52 పరీక్ష కేంద్రాలలో 10013 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కాగా ఈ పదవతరగతి పరీక్షలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా తో పాటు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అదనపు కలెక్టర్ శ్యామల దేవి, స్పెషల్ సూపరింటెండెంట్లు ఆయా కేంద్రాలను సందర్శించినట్టు తెలిపారు.

విద్యానగర్ లోని జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మరికొన్ని పరీక్ష కేంద్రాలలో జిల్లా ఎస్పీ సందర్శించారు. విద్యార్ధుల హాజరు శాతాన్ని డీఈఓ ప్రణితను అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాలలో ఆన్ని మౌలిక వసతులను పరిశీలించి పరీక్షలు అయ్యేంతవరకు పకడ్బందీగా వ్యవహరించాలని, విద్యార్థులు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, తదితర పరీక్షా కేంద్రాలకు తీసుకురాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

Next Story

Most Viewed