- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ పై పెట్టింది ముమ్మాటికీ అక్రమ కేసే
దిశ, ఖమ్మం : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికీ అక్రమ కేసు లు పెట్టారని, ప్రజాస్వామ్యవాదులంతా దీన్ని తీవ్రంగా ఖండించాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... రాజకీయ కక్షలో భాగంగానే ఈ - కార్ రేసింగ్ లో అవకతవకలు జరిగాయని చెప్పి కేసులు నమోదు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ను ఇతర దేశాలకు ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్ రేసింగ్ తీసుకొచ్చారని గుర్తు చేశారు. అందులో ఎలాంటి అవకతవకలు జరిగాయో బహిరంగంగా చెప్పకుండా రాత్రికి రాత్రే కేసులు నమోదు చేసి భయపెట్టించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో ఈ వ్యవస్థ పై చర్చ పెట్టి ఎక్కడ అక్రమాలు జరిగాయో ప్రజలకు వివరించాలని, అలా కాకుండా ఒకే వ్యక్తిని టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజయమన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ పై కేసులు నమోదు చేసి మానసికంగా దెబ్బ తీసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో ఈ కార్ రేసింగ్ వ్యవస్థపై చర్చ పెట్టకుండా కాంగ్రెస్ మంత్రులు దాటవేస్తున్నారంటే ఈ కార్ రేసింగ్ లో అక్రమాలు జరిగాయా లేవో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు దీటుగా అభివృద్ధి చేయడి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని కక్షతోనే తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్దేశపూర్వకంగా కేసుల్లో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నేతలపై నమోదు చేస్తున్న కేసులపై ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు వెంకటరమణ, గుండాల కృష్ణ, కొండబాల కోటేశ్వరరావు, బొమ్మర రామ్మూర్తి, బెల్లం వేణు తదితరులు పాల్గొన్నారు.