Tinmar Mallanna: ఆ ప్రాజెక్టులకు దేవుళ్ల పేర్లు తొలగించాలి.. తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్

by Prasad Jukanti |
Tinmar Mallanna: ఆ ప్రాజెక్టులకు దేవుళ్ల పేర్లు తొలగించాలి.. తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు కేసీఆర్ పెట్టిన దేవుళ్ల పేర్లను తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ అనేక ప్రాజెక్టులకు దేవుళ్ల పేర్లు (Names of gods for projects) పెట్టారని ఈ ప్రాజెక్టుల వల్ల నష్టపోయిన ప్రజలు ప్రాజెక్టులనో కేసీఆర్ నో అనడం లేదని దేవుళ్లను తిట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. అందువల్ల ఈ ప్రభుత్వం ఎలాగూ కాళేశ్వరం (Kaleshwaram) అంశాన్ని చూస్తోందని అందులో భాగంగానే దేవుళ్ల పేర్లను తొలగించాలని కోరారు. తాజాగా ఆయన ఓ చానల్ లో మాట్లాడిన ఆయన కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కాళేశ్వరం, సరస్వతి, లక్ష్మి, యాదాద్రి, భద్రాద్రి వంటి పేర్లు పెట్టారని గుర్తు చేశారు. దేవుళ్లను ముందు పెట్టి కేసీఆర్ తిట్టించారని ఇది ఎంతో మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం అన్నారు. దేవుళ్ల పేర్లు పెట్టిన ప్రాజెక్టులన్నింటిలో అవినీతి జరిగిందని తెలిపోయింది. వీటికి దేవుళ్ల పేర్లు పెట్టడం సబబేనా అన్నారు. ఈ విషంలో తాను ప్రభుత్వానికి లేఖ కూడా పంపుతానన్నారు.

Advertisement

Next Story

Most Viewed