Formula-E Car Race: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-20 11:57:02.0  )
Formula-E Car Race: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)కు ఊరట లభించింది. పది రోజుల పాటు కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 30వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణ కొనసాగుతుందని, విచారణకు కేటీఆర్‌ సహకరించాలని ఆదేశాల్లో పేర్కొంది. తనపై పెట్టిన FIRను కొట్టేయాలన్న కేటీఆర్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌ దాదాపు 2 గంటల పాటు సాగిన వాదనలు కొనసాగాయి. తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed