Hezbollah : మరో కీలక హిజ్బొల్లా నేత హతం!

by M.Rajitha |
Hezbollah : మరో కీలక హిజ్బొల్లా నేత హతం!
X

దిశ, వెబ్ డెస్క్ : హిజ్బొల్లా(Hezbollah)కు మరో కీలక నేతను కోల్పోయింది. లెబనాన్(Lebanon) రాజధాని బీరుట్(Beerut) పై ఇజ్రాయెల్(Israel) జరిపిన వైమానిక దాడిలో హిజ్బొల్లా మీడియా వ్యవహారాలు పర్యవేక్షించే ముఖ్య నేత మహ్మద్ అఫిఫ్(Mohmad Afif) మృతి చెందినట్టు పలు వార్తాసంస్థలు వార్తలు ప్రసారం చేశాయి. అఫిఫ్ ఎన్నో ఏళ్లుగా హిజ్బొల్లాలో పని చేస్తున్నాడు. హిజ్బొల్లా అధిపతి హాసన్ నస్రల్లా దాడుల్లో మరణించాక అఫిఫ్ ఎక్కువగా బాహ్య ప్రపంచంలో కనిపించారు. కాగా అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమనాపై లెబనాన్ ఆలోచిస్తున్న తరుణంలో బీరుట్ లో ఇజ్రాయెల్ దాడులు జరపడం కీలక పరిణామంగా మారింది. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యుహు ఇంటిపై జరిగిన దాడులకు ఈవీ ప్రతీకార దాడులు అయి ఉండవచ్చని తెలుస్తోంది.

Advertisement

Next Story